Nagarjuna Sagar Bypoll: మిషన్ భగీరథ వాటర్.. జానారెడ్డి వర్సెస్ టీఆర్ఎస్.. వరుసగా ఆసక్తికర ఘటనలు..!

|

Feb 14, 2021 | 6:16 PM

Nagarjuna Sagar Bypoll: ఇటీవల హాలియాలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నల్లగొండ రాజకీయాలను

Nagarjuna Sagar Bypoll: మిషన్ భగీరథ వాటర్.. జానారెడ్డి వర్సెస్ టీఆర్ఎస్.. వరుసగా ఆసక్తికర ఘటనలు..!
Follow us on

Nagarjuna Sagar Bypoll: ఇటీవల హాలియాలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో నల్లగొండ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆ సభలో మిషన్ భగీరథ గురించి మాట్లాడిన సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి నీటిని అందిస్తున్నామని అన్నారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అన్నీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. స్వయంగా తన ఇంట్లోనే మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటూ జానారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, దీనికి స్పందించిన స్థానిక టీఆర్ఎస్ నేతలు.. అధికారులతో కలిసి వెళ్లి అనుముల లోని జానారెడ్డి ఇంటిని పరిశీలించారు.

ఆ ఇంట్లో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ కుళాయిని పరిశీలించగా.. అందులో నుంచి నీళ్లు వచ్చాయి. దాన్ని వీడియో తీసిన టీఆర్ఎస్ నేతలు.. ‘ఇదిగో మిషన్ భగీరథ వాటర్.. మీ ఇంట్లోనూ వస్తున్నాయి.’ అంటూ జానాకు కౌంటర్ ఇచ్చారు. దీనికి కూడా జానారెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు అనుములలో నీళ్లు వస్తున్నాయంటున్న ఇళ్లు తమది కాదని స్పష్టం చేశారు. అనుములలో ఉన్న తమ ఇంటిని ఎప్పుడో అమ్మేశామని వెల్లడించారు. హాలియాలో తమ ఇళ్లు ఉందని, అక్కడ మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. అయితే, తాను అధికారులతో, మంత్రితో నిరంతరం మాట్లాడితేనే గానీ అక్కడక్కడా ఇళ్లలో మిషన్ భగీరథ కనెక్షన్లు ఇస్తున్నారని జానారెడ్డి చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గానికి ఎన్నికల నిర్వహించేందుకు మరికొద్దిరోజుల్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ ఉపఎన్నిక నేపథ్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ప్రధాన పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Also read:

సూపర్ హిట్ మూవీస్‌ రిజెక్ట్ చేసిన అక్కినేనివారబ్బాయి, అవి చేసి ఉంటే కెరీర్ ఓ రేంజ్‌లో ఉండేదంటున్న ఫ్యాన్స్.. లిస్ట్ ఏమింటే..

రాజకీయ నాయకులు, సినిమా హీరోల ఛాలెంజ్‌లే కాదు.. ఈ అమ్మాయి ఛాలెంజ్‌ కూడా స్వీకరించండి