Harsha Vardhan vs Jupally: కొల్లాపూర్‌లో టెన్షన్ టెన్షన్.. ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్.. ఇంటి వద్ద ఎదురు చూస్తున్న జూపల్లి..

|

Jun 26, 2022 | 10:12 AM

Harsha Vardhan Reddy Vs Jupally Krishna Rao: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Harsha Vardhan vs Jupally: కొల్లాపూర్‌లో టెన్షన్ టెన్షన్.. ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్.. ఇంటి వద్ద ఎదురు చూస్తున్న జూపల్లి..
Kollapur
Follow us on

Harsha Vardhan Reddy Vs Jupally Krishna Rao: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ల పరస్పర సవాళ్లే ఈ ఉద్రిక్తతకు కారణం. పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకున్న ఈ ఇద్దరు నేతలు.. కొల్లాపూర్ అంబేద్కర్ సెంటర్ వేదికగా ముఖాముఖి చర్చకు సిద్ధమయ్యారు. డేట్, టైమ్ ఫిక్స్ చేసుకుని మరీ సవాళ్లు విసిరారు. ఆ సవాళ్ల మేరకు ఇవాళ మాజీ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలు కోల్లాపూర్ పట్టణానికి వచ్చారు. వీరిద్దరి రాకతో కోల్లాపూర్‌లో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.

ఇదిలాఉంటే.. వీరి సవాళ్ల కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు.. ముందస్తుగా అరెస్ట్‌లు చేస్తున్నారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులను సైతం అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ తగ్గేదే లేదంటున్నారు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. జూపల్లితో చర్చకు తాము సిద్ధం అని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఇంటికి వస్తామంటే అంబేద్కర్ చౌరస్తాకు రమ్మన్నారని, ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తాకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు హర్షవర్ధన్ రెడ్డి. అయినప్పటికీ తాను జూపల్లి ఇంటికి తప్పక వెళ్తానని అన్నారు.

మరోవైపు ఎమ్మెల్యే ఆరోపణలపై జూపల్లి అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తనపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు రుజువు చేయాలని అన్నారు. ‘‘ఆరోపణల నిరూపణకు ఇందుకోసం 15 రోజులు గడువు ఇచ్చాను. ప్లేస్, సమయం నిర్ణయించాలని కోరా. ఇంత చెప్పినా హర్షవర్ధన్ స్పందించలేదు. చివరకు అంబేద్కర్ చౌరస్తా వద్ద చర్చకు సిద్ధమా అని అడిగాను.. అంబేద్కర్ చౌరస్తా కాదు నా ఇంటికే వస్తానన్నారు. ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తా అంటున్నారు. మాట మార్చే లక్షణం నాది కాదు. కొందరు ఉమ్మివేసినా తుడిచేసుకుపోతారు. నాపై ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలి. నా ఇంటికే వస్తా అన్నారు. నేను ఇక్కడే ఎదురు చూస్తా. రానిపక్షంలో మధ్యాహ్నం తర్వాత ప్రెస్‌మీట్ పెడతా. మీడియానే వేదిక నిర్ణయిస్తే రావడానికి నేను సిద్ధం. ’’ అని జూపల్లి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..