
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. నవంబర్, 23 తెల్లవారి 4గంటల సమయంలో బొటానికల్ గార్డెన్ నుంచి చిరాక్ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్తున్న వైట్ కలర్ మారుతీ బ్రీజా కారును ఆపి తనిఖీలు నిర్వహించారు. TS 02 EY 2678 రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కలిగిన వాహనంలో ఎలాంటి లెక్కలు, ఆధారాలు చూపకుండా ఐదు కోట్ల నగదును తీసుకెళ్తున్న (డి. సంతోష్, నరేష్, సంపత్) ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఐదు కోట్ల నగదుతో పాటూ వాహనాన్ని సీజ్ చేశారు పోలీసు అధికారులు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించినదిగా గుర్తించి అక్రమంగా తరలిస్తున్న నగదును ఐటీశాఖకు అప్పగించారు.
Hyderabad
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..