
పెద్దపల్లి రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఫైట్ ముదిరింది. ఇసుక ముడుపులపై ప్రమాణాల లొల్లి పోలీసు స్టేషన్‌కు చేరింది. సుల్తానాబాద్ పోలీసు స్టేషన్‌లో ఇరు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. పోటాపోటీ నేతలతో హోరెత్తించారు. ఇసుక వివాదంపై ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇందులో భాగంగా సుల్తానబాద్‌లో కూడా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలను తీసుకొచ్చారు. దీంతో పీఎస్‌లోనే ఇరువర్గాల నేతలు తోపులాటకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కకు తీసుకెళ్లారు. మరోవైపు ఇటు మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఓదెల ఆలయం దగ్గర అరెస్టు చేశారు. ధర్మారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. ఇసుక టెండర్లలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి డబ్బులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు.
ముడుపులు తీసుకోకపోతే దమ్ముంటే నియోజకవర్గంలోని ఓదెల మల్లన్న ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తాను తీసుకోలేదని మల్లన్న సాక్షిగా ప్రమాణం చేస్తానని ఇవాళ ఆలయానికి బయల్దేరారు. దీంతో ఓదెల ఆలయంలోకి వెళ్లకుండా విజయరమణారావు పోలీసులు అడ్డకున్నారు. ఆలయం దగ్గర అరెస్ట్ చేశారు. ఇసుక రీచ్‌ల నుంచి డబ్బులు తీసుకోలేదని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రమాణం చేయాలని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు వారం రోజుల కిందట సవాల్ విసిరారు. అయితే లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి. పెద్దపల్లి నియోజకవర్గంలో మానేరు వాగు ప్రవాహిస్తోంది.
పెద్దపల్లి నియోజకవర్గంలో మానేరు వాగు ప్రవాహిస్తోంది. దీంతో ఇక్కడ ఇసుక రీచ్‌లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకుని ఇసుక రీచ్‌లు ఇప్పించారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఇసుక రవాణాతో గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారాయని విజయరమణారావు పాదయాత్ర కూడా నిర్వహించారు. మొత్తానికి నియోజకవర్గంలో ఇసుక రాజకీయం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే సవాల్‌పై తాజా ఎమ్మెల్యే ఏం చేస్తారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం