బాలికపై పక్కింటి యువకుడు లైంగికదాడి.. ఆగ్రహంతో బాధితురాలి కుటుంబీకులు ఏంచేశారంటే..

ఈ మధ్య కొంతమంది మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తూ అభం,శుభం తెలియని చిన్నారుల జీవితాలను ఆదిలోనే చిదిమేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజగా సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఏడో తరగతి బాలికపై పక్కింట్లో ఉండే యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.

బాలికపై పక్కింటి యువకుడు లైంగికదాడి.. ఆగ్రహంతో బాధితురాలి కుటుంబీకులు ఏంచేశారంటే..
Man Molests Young Girl
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 30, 2024 | 3:13 PM

ఈ మధ్య కొంతమంది మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తూ అభం,శుభం తెలియని చిన్నారుల జీవితాలను ఆదిలోనే చిదిమేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజగా సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఏడో తరగతి బాలికపై పక్కింట్లో ఉండే యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కొమురవెల్లి మండలం గురువన్నపేటలో చోటు చేసుకుంది.

గురవున్నపేట గ్రామానికి చెందిన ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై శుక్రవారం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అత్యాచారం చేశాడు. కాగా శనివారం బాలికకు కడుపునొప్పి రావడంతో పాటు బ్లీడింగ్ కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అత్యాచారం జరిగిందని తెలియడంతో కుటుంబ సభ్యులు బాలికను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులు ఆ యువకుని ఇంటికి వెళ్లి గొడవ చేయగా..యువకునితో పాటు అతని కుటుంబ సభ్యులు ఊరి నుండి పరారైయ్యారు.

దీనితో ఆగ్రహించిన బాలిక కుంటుంబ సభ్యులు యువకుని ఇంటి పై దాడి చేసి, ఇంటి పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మెయిన్ డోర్‌కి అగ్గి అంటుకుంది. అక్కడే ఉన్న కారు, జేసిబీలపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని అందర్నీ చెదరగొట్టి గోడవను కంట్రోల్ చేశారు. కాగా ఇప్పటికే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరణ చేయలేదు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి వారిని వదిలిపెట్టవద్దని కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యలు డిమాండ్ చేస్తున్నారు.

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక