పోలీసుల సమయస్ఫూర్తి.. సీపీఆర్‌తో మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్!

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ప్రాణాలు పోతున్నాయి. కొన్ని సందర్భాలలో అదృష్టవశాత్తూ ఏదో ఒక రూపంలో ప్రాణాలు నిలుస్తాయి. తాజా ఓ మహిళ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. ఆమె ప్రాణాల మీదకు వచ్చింది. అయితే అక్కడి చేరుకున్న పోలీసులు.. దేవుడి రూపంలో ఆమెకు పునర్జన్మ ప్రసాదించారు.

పోలీసుల సమయస్ఫూర్తి.. సీపీఆర్‌తో మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్!
Police Saves Woman Life

Edited By: Balaraju Goud

Updated on: Oct 11, 2025 | 5:22 PM

మెదక్ జిల్లా పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మహిళా ప్రాణం కాపాడారు. అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. చిన్న చిన్న విషయాలకే కొంతమంది ప్రాణాలను తీసుకోవడానికి వెనుకాడడం లేదు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ప్రాణాలు పోతున్నాయి. కొన్ని సందర్భాలలో అదృష్టవశాత్తూ ఏదో ఒక రూపంలో ప్రాణాలు నిలుస్తాయి. తాజా ఓ మహిళ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. ఆమె ప్రాణాల మీదకు వచ్చింది. అయితే అక్కడి చేరుకున్న పోలీసులు.. దేవుడి రూపంలో ఆమెకు పునర్జన్మ ప్రసాదించారు.

క్షణికావేశంలో మహిళ తీసుకున్న నిర్ణయం ప్రాణాలు పోయినంత పనైంది. పోలీసులు వెంటనే స్పందించి సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. హవెలి ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాసన్ పల్లి గ్రామం నుండి డయల్ 100కి కాల్ వచ్చింది. జ్యోతి అనే మహిళ తన ఇంటిలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుందని పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు 5 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గడ్డపర ద్వారా ఇంటి తలుపులను పగలగొట్టారు. లోపలికి వెళ్లి చూసేసరికి అంతా షాక్ అయ్యారు.

లింగాసన్ పల్లి గ్రామానికి చెందిన జ్యోతి అనే వివాహిత కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో మెడకు చీర బిగుసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే స్పందించిన పోలీసులు జ్యోతికి CPR చేసి, మహిళను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీస్ కానిస్టేబుల్స్ వరప్రసాద్, జైనంద్, రమేశ్ తక్షణమే స్పందించి సమయస్పూర్తితో వ్యవహారించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి ప్రాణం కాపాడిన కానిస్టేబుళ్ళపై ప్రశంసలు కురుస్తున్నాయి.

వీడియో చూడండిః

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..