Munugodu: మంత్రి కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు.. అణువణువూ శోధన.. ఆ తర్వాత..

|

Oct 27, 2022 | 1:57 PM

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికకు గడువు సమీపిస్తోంది. దీంతో ఓటర్లను ఎలాగైనా తమ వైపు తిప్పికునేందుకు సరికొత్త ప్రయత్నాలకు తెర లేపుతున్నారు. అందులో భాగంగా..

Munugodu: మంత్రి కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు.. అణువణువూ శోధన.. ఆ తర్వాత..
Errabelli Dayakar
Follow us on

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికకు గడువు సమీపిస్తోంది. దీంతో ఓటర్లను ఎలాగైనా తమ వైపు తిప్పికునేందుకు సరికొత్త ప్రయత్నాలకు తెర లేపుతున్నారు. అందులో భాగంగా ప్రలోభాలు చేస్తున్నారు. మద్యం, బిర్యానీ, మాంసం పంచడంతో పాటు డబ్బు, చీరలు కూడా ఇస్తున్నారు. ఒక పార్టీ ఇచ్చిన మొత్తం కంటే అధికంగా మరో పార్టీ ఇస్తున్నారు. ఇలా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అక్రమంగా తరలించే డబ్బుపై అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాలు, కార్లను ఆపి చెక్ చేస్తున్నారు. తాజాగా లక్కలపల్లి చెక్ పోస్ట్ వద్ద రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ ని ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మంత్రి ప్రయాణిస్తున్న కారులో బ్యాగులతో పాటు అణువణువూ శోధించారు. మంత్రి వెంట కాన్వాయ్ లోని అన్ని వాహనాలను పరిశీలించారు. తనిఖీ చేస్తున్న పోలీసులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారం అందించారు. కాన్వాయ్ ను చెక్ చేసిన అనంతరం మంత్రి వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చారు.

కాగా.. గతంలోనూ అక్రమంగా తరిస్తున్న డబ్బు పట్టుబడింది. హైదరాబాద్‌ శివారులో నిర్వహించిన తనిఖీల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంబంధీకులు తరలిస్తున్న రూ.కోటి నగదును పోలీసులు పట్టుకొన్నారు. ఈ నగదు మునుగోడుకు తరలిస్తున్నట్టు విచారణలో తేలిందని, వారిని అరెస్టు చేసినట్టు మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఈ సొమ్మును కోమటిరెడ్డి రాజేందర్‌రెడ్డి తనయుడు సుమంత్‌రెడ్డికి అందజేయడానికి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్‌లో ఆదివారం రూ.8 లక్షల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. సుద్దపల్లి, వింజమూరు సరిహద్దుల్లో దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావు, నాంపల్లి సీఐ విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..