ఈ ఆటోలో అలా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ప్రేమ జంట.. ఎక్కడంటే..

| Edited By: Srikar T

Jul 24, 2024 | 3:40 PM

ఒంటరి వృద్దులు కనబడితే చాలు.. వారి అభరణాల చోరికి స్కెచ్ వేస్తారు. తోటి ప్రయాణికుల్లా కలిసిపోతారు. మాటలతో మాయ చేసి ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తారు. బెదిరించి బంగారు ఆభరణాలు దోపిడీ చేస్తారు. ఇలా ఐదు కేసుల్లో నిందితులుగా తేలారు పాలమూరులో లవ్ బర్డ్స్. అసలు ఏంటి ఈ కిలాడి జోడి కథ.. ఎక్కడ జరుగుతున్నాయి ఈ దోపిడీలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.

ఈ ఆటోలో అలా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ప్రేమ జంట.. ఎక్కడంటే..
Auto
Follow us on

ఒంటరి వృద్దులు కనబడితే చాలు.. వారి అభరణాల చోరికి స్కెచ్ వేస్తారు. తోటి ప్రయాణికుల్లా కలిసిపోతారు. మాటలతో మాయ చేసి ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తారు. బెదిరించి బంగారు ఆభరణాలు దోపిడీ చేస్తారు. ఇలా ఐదు కేసుల్లో నిందితులుగా తేలారు పాలమూరులో లవ్ బర్డ్స్. అసలు ఏంటి ఈ కిలాడి జోడి కథ.. ఎక్కడ జరుగుతున్నాయి ఈ దోపిడీలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.

పాలమూరు జిల్లాలో కిలాడీ జోడీ కలకలం రేపింది. ఒంటరి వృద్ధులే లక్ష్యంగా ఈ జోడీ దోపిడీలు సంచలనంగా మారాయి. మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్(36)కు సబాపది ఉమ(39) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. షేక్ మహమ్మద్‎కు వివాహం అయినప్పటికీ భార్యను వదిలేసి మహబూబ్‎నగర్ జిల్లా కేంద్రానికి చేరుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఆటోడ్రైవర్‎గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తమ అవసరాల కోసం ఈ ఇద్దరు ప్రేమికులు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇద్దరూ ఆటోలో ప్రయాణిస్తూ మహబూబ్‎నగర్ జిల్లా కేంద్రంలో ఒంటరిగా ప్రయాణించే వృద్ద మహిళలను టార్గెట్ చేసుకున్నారు. దూరం నుంచే వృద్ధుల బంగారు అభరణాలపై కన్నేసి ఆతర్వాత వారిని ట్రాప్‎లోకి దింపుతారు. ఆటోలో నుంచి నిందితురాలు ఉమ దిగి తోటి ప్రయాణికురాలిగా వృద్ద మహిళతో పరిచయం చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్లాలో వాకబు చేసి తాను కూడా అటు వైపే వెళ్తున్నానని నమ్మబలుకుతుంది. తాను వెళ్తున్న ఆటోలోనే ఇంటి వద్ద దింపేస్తానని వారిని ఒప్పిస్తారు.

సీన్ కట్ చేస్తే షేక్ మహమ్మద్ ఆటోతో సిద్ధంగా ఉంటాడు. ఉమ వృద్ద మహిళను తీసుకువచ్చి ఆటోలో ఎక్కిస్తుంది. తీరా నిర్మానుష్యా ప్రాంతానికి తీసుకెళ్లి మహిళ ఆభరణాలు దోచుకుంటారు కిలాడి జంట. ఇలా సుమారు ఐదు కేసుల్లో నిందితులుగా తేలారు. అభరణాలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించి అందినకాడికి దోచుకుంటారు. అనంతరం అక్కడే వదిలి వెళ్లిపోతారు. ధర్మాపూర్ శివారులో ఓ మహిళను, నవాబ్ పేట మండలం యన్మన్ గండ్ల గేట్, రుద్రారం గ్రామ శివారులో మరొకరిని టార్గెట్ చేశారు. జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లుల దగ్గర మరో ఇద్దరు మహిళల నుంచి బంగారు అభరణాలు దోపిడి చేశారు.

ఆదిలోనే ఎండ్ కార్డు వేసిన ఖాకీలు:

స్వల్ప కాలంలోనే ఐదు ప్రాంతాల్లో దోపిడికి పాల్పడ్డారు ఈ లవ్ బర్డ్స్. అయితే వరుస ఘటనలను సీరియస్‎గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించారు. ఆటోల తనిఖీలలో భాగంగా వీరిద్దరు అనుమానస్పదంగా కనపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో చేసిన దోపిడీల చిట్టా బయటపడింది. నిందితుల వద్ద నుంచి 9తులాల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో సంచలనంగా మారిన వరుస దోపిడిలకు పాల్పడుతున్న కిలాడీ జోడీ ఆట కట్టించారు ఖాకీలు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..