Sharmila – Kavitha: ‘నేను ఉద్యమం నుంచి పుట్టిన మట్టి కవితను.. ఆరేంజ్ ప్యారెట్టు తెలుసుకో’.. షర్మిలకు కవిత కౌంటర్

| Edited By: Ravi Kiran

Nov 30, 2022 | 10:39 PM

షర్మిలకు, కవితకు మధ్య ట్విట్టర్ వార్ నెక్ట్స్ లెవల్‌కు చేరింది. ప్రాసలు.. పంచ్‌ల విషయంలో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు.

Sharmila - Kavitha: నేను ఉద్యమం నుంచి పుట్టిన మట్టి కవితను.. ఆరేంజ్ ప్యారెట్టు తెలుసుకో.. షర్మిలకు కవిత కౌంటర్
Kalvakuntla Kavitha - Ys Sharmila
Follow us on

ఓవైపు మాటల మంటలు.. మరోవైపు ట్విట్టర్ వార్.! షర్మిల వర్సెస్ కవిత అన్నట్లుగా మారిపోయింది సీన్. కవిత ట్వీట్‌కు షర్మిల కౌంటర్‌ . మళ్లీ ఆ ట్వీట్‌కు కవిత స్ట్రాంగ్ రిప్లై ఇలా నాన్‌స్టాప్‌గా సాగిపోతోంది యుద్ధం.! కామెంట్స్‌తోనే ఓ రేంజ్‌లో కాకరేపుతున్నారు. “తాము వదిలిన బాణం తాన అంటే తామరపువ్వులు తందాన అంటున్నాయంటూ ఉదయం ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజాసమస్యలు చూసింది లేదు.. పదవులే కానీ.. పనితనం లేని గులాబీ తోటలో కవితలకు కొదవలేదంటూ కౌంటర్ ఇచ్చారు షర్మిల.

అమ్మా.. కమల బాణం.. ఇది మా తెలంగాణం.! పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం అంటూ షర్మిలకు మళ్లీ కౌంటర్ ఇచ్చారు కవిత. “మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు.  నేడు తెలంగాణ రూటు మీరు కమలం కోవర్టు. ఆరేంజ్ ప్యారెట్టు. మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను.  రాజ్యం వచ్చాకే రాలేదు నేను. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి ‘కవిత’ను నేను ! ” ఇలా ప్రాసలతో కూడిన పంచ్‌లు పేల్చుతూ షర్మిలకు కౌంటర్ ఇచ్చారు MLC కవిత.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం