PM Narendra Modi: అటు వరాల మోత- ఇటు విమర్శల వాత.. పొలిటికల్ హీట్ పెంచిన ప్రధాని మోదీ..

Mahbubnagar: తెలంగాణపై వరాల జల్లు కురిపించిన ప్రధాని మోదీ.. తర్వాత జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో రాష్ట్ర సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. మోదీ ప్రసంగం సభ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అభివృద్ధి కార్యక్రమంలో ఎలాంటి వరాలు కురిపించారో.. దానికి తగ్గట్టుగా తనదైన స్టైల్‌లో విమర్శనాస్త్రాలు కురిపించారు ప్రధానమంత్రి మోదీ.

PM Narendra Modi: అటు వరాల మోత- ఇటు విమర్శల వాత.. పొలిటికల్ హీట్ పెంచిన ప్రధాని మోదీ..
Narendra Modi

Edited By:

Updated on: Oct 01, 2023 | 5:53 PM

మెహబూబ్‌నగర్, అక్టోబర్ 1: తెలంగాణపై వరాల జల్లు కురిపించిన ప్రధాని మోదీ.. తర్వాత జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో రాష్ట్ర సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. మోదీ ప్రసంగం సభ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అభివృద్ధి కార్యక్రమంలో ఎలాంటి వరాలు కురిపించారో.. దానికి తగ్గట్టుగా తనదైన స్టైల్‌లో విమర్శనాస్త్రాలు కురిపించారు ప్రధానమంత్రి మోదీ.

స్వచ్ఛ భారత్ అవస్యకతను తెలియజేస్తూ మహబూబ్​నగర్​ బహిరంగ సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలను పదే పదే ‘నా కుటుంబ సభ్యులారా’ అని సంబోధించిన మోదీ సభలో జోష్ నింపారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్థావిస్తూ, భవిష్యత్తులో కూడా అలాంటి మార్పు మళ్ళీ జరుగుతుందని భావిస్తున్నానన్నారు. తెలంగాణ మార్పు కోరుకుంటోందని, అది బీజేపీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని మోదీ అన్నారు.

రాష్ట్రంలో అవినీతి, అబద్ద వాగ్ధానల ప్రభుత్వం వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, దానికి బీజేపీ సిద్దమన్నారు. ‘రాణి రుద్రమ్మ వంటి గొప్పవారు పుట్టిన తెలంగాణ ఇది.. మహిళలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యత పెంచిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం’ అని ప్రధాని మోదీ అన్నారు. ఇలా మహిళలకు, పేదలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు మోదీ. తెలంగాణ అభివృద్ధికి కూడా బీజేపీ కట్టుబడి ఉందన్నారు. దేశంలో గత పాలక ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు ఒక్కసారి పోల్చి చూసుకోవాలని కోరారు. తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టుల పేరు మీద ఎంత దోపిడీ జరుగుతుందో గమనించాలన్నారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి తెలియజేసేందుకు ఇదో చక్కని ఉదాహరణగా మోదీ పేర్కొన్నారు.

అలాగే ‘తెలంగాణలో మా ప్రభుత్వం లేకపోయినా ఇక్కడ రైతుల మంచి కోసం మేం నిరంతరం ఆలోచిస్తున్నాం. అందువల్లే రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ వచ్చింది. రైతు రుణ మాఫీ అని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఏం చేసిందో మీకు బాగా తెలుసు’ అంటూ ప్రధాని మోదీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు చెప్తున్నా. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఈ రాత్రికి నిద్ర రాదు. సమ్మక్క సారక్క పేరుతో యూనివర్సిటీ స్థాపించబోతున్నాం. 5 సంవత్సరాల నుండి భూమి ఇవ్వకుండా నాన్చింది ఈ ప్రభుత్వం. దీంతోనే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవాలి. కారు పార్టీ స్టీరింగ్ వాళ్ళ చేతుల్లో లేదు, ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారో అందరికి తెలుసు’ అంటూ అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలను విమర్శించారు మోదీ.