Telangana: రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని.. దాని గురించి కీలక విషయాలు

మరికాసేపట్లో రామగుండంలోని ఈ ఎరువుల కర్మాగారం మోదీచేతుల మీదుగా ఆవిష్కృతం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఆరు సంస్థల భాగస్వామ్యంతో పునరుద్దరించిన ఈ గ్యాస్ ఆధారిత కర్మాగారానికి, ఆరు వేల కోట్ల పైచిలుకు నిధులను వెచ్చించారు.

Telangana: రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని.. దాని గురించి కీలక విషయాలు
Ramagundam Fertilizers and Chemicals Limited
Follow us

|

Updated on: Nov 12, 2022 | 9:38 AM

  1. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తోన్న తెలంగాణ ప్రజల కల సాకారం కానుంది. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారాన్ని మరికాసేపట్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. దీంతో రైతన్నల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
  2. ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ప్లాంట్‌ను జాతికి అంకితమిచ్చేందుకు ప్రధాని మోదీ రామగుండం చేరుకున్నారు. ఎరువుల కొరతతో అతలాకుతలం అవుతోన్న రైతాంగానికి ఊరటనిస్తోంది నేడు మోదీ ఆరంభించనున్న RFCL .
  3. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎరువుల కొరత తీర్చే కల్పతరువు రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ కర్మాగారాన్ని భావిస్తున్నారు. సహజవనరులు సమృద్ధిగా ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 1970 లోనాటి ప్రభుత్వం అక్టోబర్‌ 2 గాంధీజయంతి రోజున ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా FCIని ఏర్పాటు చేసింది. గతంలో ఈ కర్మాగారం ద్వారా యేటా 16 లక్షల 89 వేల 65 టన్నుల యూరియాను ఉత్పత్తి చేసేవారు.
  4. నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల అమలులో భాగంగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 1999 మార్చి 31 వ తేదీన అర్ధరాత్రి మూసివేశారు. దేశంలో ఎరువుల కొరత తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో మూతపడిన, నష్టాల్లో ఉన్న ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో నాటి FCI , RFCL గా మారి పునరుద్ధరణకు నోచుకుంది.
  5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఆరు సంస్థల భాగస్వామ్యంతో FCI , RFCL గా పునరుద్ధరించారు. ఈ కార్మాగారాన్ని గ్యాస్ ఆధారితంగా రూపొందించారు. RFCL పునఃనిర్మాణం ద్వారా రైతాంగానికి ఎరువుల కొరతను తీర్చాలని భావించిన కేంద్రం ఈ కర్మాగారం పునరుద్ధరణకు 6,120 కోట్ల రూపాయలను కేటాయించింది.
  6. ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా ఈ ఎరువుల కర్మాగారం పనిచేస్తుంది. ఇందులో ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల ఫెర్టిలైజర్స్‌ని తెలంగాణకి కేటాయిస్తారు. RFCL లో 160 కోట్లు పెట్టుబడి పెట్టిన తెలంగాణకి 11 శాతం షేర్స్‌ ఉన్నాయి. మిషన్‌ బగీరథ కింద 80 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కర్మాగారానికి వాటర్‌పైప్‌లైన్‌ని ఏర్పాటు చేసింది. రోడ్లు, విద్యుత్‌ కోసం తెలంగాణ ప్రభుత్వం మరో 14 కోట్ల రూపాయలను వెచ్చించింది.
  7. 2015 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వం RFCL నిర్మాణ పనులను ప్రారంభించగా, 2016 ఆగస్టు 7వ తేదీన గజ్వేల్ లో ప్రధాని నరేంద్ర మోడీ దీనికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. 2020 ఫిబ్రవరి 21న ట్రయల్ రన్ ప్రారంభమైంది. 2021 మే 28వ తేదీ నాటికి పూర్తిస్థాయి ఉత్పత్తి దశకు చేరుకున్న ఈ కర్మాగారంలో ప్రస్తుతం రోజుకు 2200 టన్నుల అమోనియా, 3850 టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తున్నారు.
  8. ఈ కర్మాగారం పునరుద్ధరణతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల రైతాంగానికి ఎరువుల కొరత తీరనుంది. ఇక్కడ ఉత్పత్తి చేసే ఎరువుల్లో 46 % ఎరువులను తెలంగాణకి ఉపయోగించనున్నారు. మిగిలిన 54 శాతాన్ని ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలకు డిస్ట్రిబ్యూట్‌ చేస్తారు.
  9. మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తున్న RFCL గ్యాస్ ఆధారిత కర్మాగారం. రైతులపాలిట కల్పదరువుగా భావిస్తోన్నఈ ఎరువుల కర్మాగారం ఆవిష్కారంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మరోవైపు ప్రధాని కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!