
పాలమూరు, సెప్టెంబర్ 01: పాలమూరు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పాలమూరు పర్యటనలో జాతీయ రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియంతోపాటు సహజ వాయువు, ఉన్నత విద్యలకు సంబంధించి దాదాపుగా రూ.13వేల 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోదీ. నాగ్ పుర్- విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా రోడ్డు ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. 90 కి.మీ. పొడవైన ఫోర్ లైన్ యాక్సెస్ తో కూడిన ఖమ్మం To విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు.
వరంగల్ – ఖమ్మం – విజయవాడ హైవే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొత్త భవనాలు ప్రారంభించారు. హసన్-చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్ జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ.
తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పాలమూరులో జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో ప్రధాని ప్రారంభించారు. మరిన్ని కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రజా ఘర్జనసభలో ప్రధాని పలు కీలక ప్రకటన చేశారు. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసిందన్నారు ప్రధాని మోదీ. పసుపుపై పరిశోధనలూ పెరిగాయన్నారు. తెలంగాణలో పసుపు రైతుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటుతో రాష్ట్ర పసుపు రైతులతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు ప్రధాని మోదీ.
#WATCH | Mahabubnagar, Telangana: PM Modi says, “The season of festivals has started. Navratri is about to begin but by passing the Women’s Reservation Bill in the Parliament, we established the emotion of worshipping ‘Shakti’ before it… Today, in Telangana, many projects are… pic.twitter.com/ApNRzoSJTb
— ANI (@ANI) October 1, 2023
పసుపు బోర్డుతోపాటు రాష్ట్రానికి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క- సారక్క ట్రైబల్ యూనివర్సిటీ పేరుతో దీనిని ఏర్పాటు చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం