PM Narendra Modi in Telangana Updates : పాలమూరు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పాలమూరు పర్యటనలో జాతీయ రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియంతోపాటు సహజ వాయువు, ఉన్నత విద్యలకు సంబంధించి దాదాపుగా రూ.13వేల 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోదీ. నాగ్ పుర్- విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా రోడ్డు ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. 90 కి.మీ. పొడవైన ఫోర్ లైన్ యాక్సెస్ తో కూడిన ఖమ్మం To విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు.
వరంగల్ – ఖమ్మం – విజయవాడ హైవే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొత్త భవనాలు ప్రారంభించారు. హసన్-చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్ జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ.
బీజేపీ ప్రతీ కుటుంబం గురించి ఆలోచిస్తుంది. దేశమంతా మా కుటుంబమే. బీజేపీపై తెలంగాణ ప్రజల నమ్మకం పెరుగుతూ పోతోంది. మోదీ గ్యారెంటీపై ఇక్కడి ప్రజలకు నమ్మకం ఉంది. మోదీ ఇచ్చే గ్యారెంటీని ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు.తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది కూడా ఇదే. ఇచ్చిన ప్రతీ హామీ నెరవెర్చాలన్నది వాళ్ల ఆకాంక్ష.. కలిసికట్టుగా తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్దాం. పాత మిత్రులను కలిసి నా జీవితం ధన్యమైంది. తెలంగాణ ప్రజల దర్శనం చేసుకొని నా జన్మ తరించింది.
కళలు, సంస్కృతి, నైపుణ్యానికి పేరుగాంచిన నేల తెలంగాణ. దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి బిద్రీ కళాఖండాన్ని బహుమతిగా ఇచ్చాను. ఈ మధ్యే పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభించాం. చేతివృత్తుల కళాకారులను దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేశారు. చేతివృత్తిదారులను ప్రోత్సహించేందుకు పీఎం విశ్వకర్మ తీసుకొచ్చాం. వారి ఉత్పత్తులు అమ్ముకునేందుకు కొత్త మార్కెట్లు లభిస్తాయి.
#WATCH | Mahabubnagar, Telangana: At a public meeting, PM Modi says, “Telangana is a land of art, skill and culture. The products of Telangana are being liked in the world. Some days ago, I gifted a Bidri artwork to the President of South Africa. This has increased its importance… pic.twitter.com/s9K3AacM2v
— ANI (@ANI) October 1, 2023
2014తో పోల్చితే ప్రస్తుతం రెండు రెట్లు ఎక్కువ పసుపు ఎగుమతి చేస్తున్నాం. గోల్డెన్ స్పైస్ పసుపు కోసం ప్రత్యేక బోర్డు ఇప్పటి వరకు లేదు. పసుపు కోసం ప్రత్యేకంగా ఇప్పుడు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. పసుపు బోర్డు ద్వారా తెలంగాణ రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రూ. 10 వేల కోట్లు అందించాం. తెలంగాణ పసుపు రైతుల కోసం కీలక ప్రకటన చేశాం అంటూ స్పష్టం చేశారు ప్రధాని మోదీ.
రైతు పథకాల పేరుతో తెలంగాణ సర్కారు అక్రమాలకు పాల్పడుతోంది. సాగునీటి కాలువలు ఏర్పాటు చేశామని ఇక్కడి ప్రభుత్వం గొప్పగా చెప్తోంది కాని.. ఆ కాలువలో నీరు ఉండదు. రైతు పథకాల పేరుతో తెలంగాణ సర్కారు అక్రమాలకు పాల్పపడుతోంది. రైతుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నాం. రైతుల కోసం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించాం.
#WATCH | Mahabubnagar, Telangana: At a public meeting, PM Modi says, “We are respecting our farmers. We are giving them the correct price for their hard work…Money is going directly into farmers’ bank accounts. There is no place for any middleman… This government of Telangana… pic.twitter.com/GzYUEho2CQ
— ANI (@ANI) October 1, 2023
తెలంగాణ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు అన్నదాతలను తాము గౌరవిస్తున్నాం. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తున్నాం. తెలంగాణ రైతులకు ఎంఎస్‌పీ ధల ద్వారా ఏటా రూ. 27 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు ప్రధాని మోదీ. గతంతో పోల్చితే ఈ మొత్తం 8 రేట్లు ఎక్కవ ఆ డబ్బు కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తోంది. అన్నదాతలను తాము గౌరవిస్తున్నాం. వారకి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తున్నాం.
తెలంగాణ ప్రజలు అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో 13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించాం. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ బీజేపీకి అండగా నిలుస్తున్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
తెలంగాణ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. 2014 వరకు తెలంగాణలో ఉన్న రహదారుల పొడవు 2500 కిలోమీటర్లు మాత్రమే.. అయితే ఈ తొమ్మిదేళ్ల తాము 2500 కిలోమీటర్ల రహదారులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ గ్రామము, పల్లె నుంచి పట్టణానికి వచ్చేందుకు రోడ్లు వేశామన్నారు. విద్యార్థులు, రైతులు ఉద్యోగులు, వ్యాపారులకు ఇవి ఎంతో మేలు చేస్తున్నారని అన్నారు.
రానున్న రోజుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. రాణి రుద్రమ వంటి నాయకురాళ్ల నేల తెలంగాణ. ఈ మధ్యే మనం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించుకున్నాం. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఢిల్లీలో ఒక అన్న ఉన్నారనే విషయం తెలంగాణ అక్కాచెల్లెళ్లకు తెలుసు. మహిళల కోసం లక్షల సంఖ్యలో టాయిలెట్లు ఏర్పాటు చేశాం. ఎటువంటి గ్యారెంటీ లేకుండా ముంద్ర రుణాలు అందిస్తున్నాం.
#WATCH | Mahabubnagar, Telangana: At a public meeting, PM Modi says, “In recent years, people of Telangana have strengthened BJP in Lok Sabha, Vidhan Sabha and civic elections. The huge crowd gathered here proves that Telangana wants change. Telangana wants change because it… pic.twitter.com/Fsvwm5bBTc
— ANI (@ANI) October 1, 2023
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అబద్దాలు చెప్పేవారు కాదు.. పని చేసేవారు కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
పాలమూరు ప్రజలకు నమస్కారాలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇక్కడకు వచ్చే ముందు స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నాను అంటూ వెల్లడించారు. దేశ ప్రజలు స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా మార్చారని ప్రధాని మోదీ అన్నారు.
పాలమూరులో ప్రజాగర్జన సభకు ఓపెన్‌టాప్ జీపులో సభాస్థలికి ప్రధనమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి భారీ ఎత్తున స్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు.
#WATCH | Prime Minister Narendra Modi holds a roadshow in Telangana’s Mahabubnagar. pic.twitter.com/HusD0KtioW
— ANI (@ANI) October 1, 2023
తెలంగాణ చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమ్మక్క-సారక్క దేవతలను కోట్లాది ప్రజలు పూజిస్తారని.. సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం.. గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క-సారక్క పేరుపెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణ నష్టపోతోందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పాలమూరు ప్రజా ఘర్జనసభలో ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. గత 9 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారు మండిపడ్డారు.
తెలంగాణ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తే.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలవటం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పైగా తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారని.. తెలంగాణకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారని అన్నారు. రైల్వేలు, హైవేల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంది. ఎరువులపై సబ్సిడీ రూపంలో రైతులకు కేంద్రం వేల కోట్లు ఇస్తోంది. హైదరాబాద్ చుట్టూ కేంద్రం నిర్మించే రీజనల్ రింగ్‌రోడ్డుతో రాష్ట్రం రూపురేఖలు మారతాయి.
తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ.. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతోపాటు ములుగు జిల్లాలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఆ యూనివర్సిటీ పేరును సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అంటూ తెలిపారు.
వరంగల్ – ఖమ్మం – విజయవాడ హైవే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొత్త భవనాలు ప్రారంభించారు. హసన్-చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్ జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ.
తెలంగాణకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వేలు, హైవేల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉందన్నారు. ఎరువులపై సబ్సీడీ రూపంలో రైతులకు కేంద్రం వేల కోట్లు ఇస్తోందన్నారు. హైదరాబాద్ చుట్టూ కేంద్రం నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డుతో రాష్ట్రం రూపురేఖలు మారుతున్నాయని అన్నారు.
శంషాబాద్ నుంచి పాలమూరుకు ప్రధాని మోదీ చేరుకున్నారు. పాలమూరుకు చేరుకున్న ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాతీయ రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం & సహజ వాయువు, ఉన్నత విద్యలకు సంబంధించి దాదాపుగా రూ.13వేల 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ.
హైదరాబాద్ To రాయ్‌చూర్, రాయ్‌చూర్ To హైదరాబాద్ కి తొలి రైల్వే సర్వీసును ప్రధాని ప్రారంభిస్తారు. చమురు, గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టులను శంకుస్థాపనతో పాటు వాటిని జాతికి అంకితమివ్వనున్నారు ప్రధాని మోదీ. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన అయిదు క్రొత్త భవనాలను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.
రూ. 500 కోట్ల వ్యయంతో నిర్మించిన 37 కి.మీటర్ల జక్లేరు-కృష్ణా న్యూ రైల్వే లైన్‌ను కూడా దేశప్రజలకు జాతీయం చేస్తారు ప్రధాని. ఈరైలు మార్గం నారాయణపేట జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలను రైలు మార్గాల ద్వారా చిత్రపటంలోకి తీసుకురానున్నారు.
90 కి.మీ. పొడవైన ఫోర్ లైన్ యాక్సెస్ తో కూడిన ఖమ్మం To విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. రూ. 500 కోట్ల వ్యయంతో నిర్మించిన 37 కి.మీటర్ల జక్లేరు-కృష్ణా న్యూ రైల్వే లైన్‌ను కూడా దేశప్రజలకు జాతీయం చేస్తారు ప్రధాని.
పాలమూరు పర్యటనలో జాతీయ రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం & సహజ వాయువు, ఉన్నత విద్యలకు సంబంధించి దాదాపుగా రూ.13వేల 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ. నాగ్ పుర్- విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా రోడ్డు ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
కాసేపట్లో ప్రధాని మోడీ హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో మహబూబ్‌నగర్‌కు బయలుదేరనున్నారు. అక్కడ ముందుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం.. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
పాలమూరు పర్యటనలో భాగంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనియాస్ యాదవ్ స్వాగతం పలికారు.
ప్రధాని తెలంగాణ టూర్‌ను విమర్శించే హక్కు బీఆర్‌ఎస్ నేతలకు లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రులు చేస్తున్న విమర్శలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని మోదీ. వెంటనే ఒంటి గంట 35 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్ నగర్ వెళ్తారు. 2 గంటల 5 నిమిషాలకు పాలమూరు జిల్లాకు చేరుకుంటారు మోదీ. 2గంటల 15నిమిషాల నుంచి 2గంటల 50 నిమిషాల వరకు భుత్పుర్ ఐటిఐ కళాశాల ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.. శంకుస్థాపనలు చేస్తారు ప్రధాని.. అనంతరం 3గంటలకు పక్కనే ఉన్న పాలమూరు ప్రజా గర్జన సభాస్థలికి చేరుకుంటారు మోదీ. 4 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4గంటల 15నిమిషాలకు హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానశ్రయానికి బయలుదేరుతారు. 4గంటల 45 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని.. ప్రధాని మోడీ ఢిల్లీకి తిరిగి పయనం అవుతారు.