Hyderabad: ప్లీజ్ నా ‘కిడ్నీ’ అమ్ముకోనివ్వండి.. సంచలనం సృష్టిస్తున్న ఓ వికలాంగుడి వినతిపత్రం..

Hyderabad: విధి ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కోలా చేస్తుంది. కొందరిని అపర కుభేరులుగా మారిస్తే.. మరికొందరని అథపాతాళానికి తొక్కేస్తుంది.

Hyderabad: ప్లీజ్ నా ‘కిడ్నీ’ అమ్ముకోనివ్వండి.. సంచలనం సృష్టిస్తున్న ఓ వికలాంగుడి వినతిపత్రం..
Kidney

Updated on: Sep 03, 2022 | 9:09 PM

Hyderabad: విధి ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కోలా చేస్తుంది. కొందరిని అపర కుభేరులుగా మారిస్తే.. మరికొందరని అథపాతాళానికి తొక్కేస్తుంది. ఆర్థిక సమస్యలతో జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. తాజాగా ఓ వ్యక్తి కాదు కాదు.. వికాలంగ వ్యక్తి అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. సాయం అర్థించినా ఎవరూ కనికరించకపోవడంతో.. ఏం చేయాలో దిక్కుతోచక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా తన కిడ్నీని అమ్ముకుని ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలని భావించాడు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం.. తన కిడ్నీ అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తహశీల్దారుకి వినతిపత్రం అందజేశాడు. వికారాబాద్ జిల్లా కల్కచర్లలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాల్వీడ్‌ గ్రామానికి చెందిన వెంకటయ్య వికలాంగుడు. వెంకటయ్య రెండు కాళ్ళూ చేతులు చచ్చుబడిపోయి వీల్‌ ఛైర్‌కే పరిమితమయ్యాడు. దానికి తోడు కటిక దారిద్ర్యం తన తల్లిదండ్రులిద్దర్నీ అనారోగ్యం బారినపడేలా చేసింది. పేదరికం ఈ కుటుంబాన్ని దయనీయమైన స్థితికి చేర్చింది. దాంతో అటు చావలేక, బతికే దారిలేక కిడ్నీఅమ్ముకునేందుకు సిద్ధమయ్యాడు వెంకటయ్య. తల్లిదండ్రులిద్దరూ మంచం పట్టారని, తను పనిచేసే స్థితిలో లేనని, జీవనం భారంగా మారిందని, అందుకే కిడ్నీ అమ్ముకునేందుకు అనుమతికావాలంటూ తహశీల్దారు దగ్గరకు వచ్చానన్నాడు వెంకటయ్య. వెంకటయ్య వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మార్వో.. వెంకటయ్య కుటుంబ పరిస్థితులను పరిశీలించి, కలెక్టరుకి నివేదిక పంపుతానన్నారు. వెంకటయ్యను ఆదుకునే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..