BRS వర్సెస్ BJP.. మళ్లీ చాలెంజ్‌లు, సవాళ్లు, ప్రమాణాల పర్వం.. బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్‌రెడ్డికి నోటీసులతో తెలంగాణ పాలిటిక్స్ హాట్‌హాట్‌గా మారాయి. దీనిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. బెంగళూరు డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ పేర్కొన్నారు. ఈడీ నోటీసుల అనంతరం.. శనివారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్‌కు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. తనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నానని.. బెంగళూరు డ్రగ్స్ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు 24 గంటల టైమ్ ఇస్తున్నానని.. ఈ డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్నట్లు రుజువులతో రావాలంటూ సవాల్ చేశారు. ఆదివారం ఇదే టైమ్ వస్తానని.. బండి సంజయ్ కూడా రావాలంటూ పేర్కనొ్నారు.
కాగా.. బెంగళూరు డ్రగ్స్ కేసులో తనకు సంబంధం లేదంటున్నారు పైలట్ రోహిత్ రెడ్డి. ED తనకు నోటీసులిస్తుందన్న విషయం.. బండి సంజయ్‌కు ముందే ఎలా తెలిసిందని ప్రశ్నిస్తున్నారు. యాదగిరి గుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేస్తారా? అంటూ సంజయ్‌కు రోహిత్‌రెడ్డి చాలెంజ్ విసిరారు.
కాసేపట్లో సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి భేటీ కానున్నారు. ఈడీ నోటీసులపై కేసీఆర్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. పలువురు బీఆర్ఎస్ నేతలకు పలు కేసుల్లో ఈడీ నోటీసులు అందిన విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..