
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలిపారు. లీకులతో మాకు సంబంధం లేదని విషయాలను బయటపెట్టి బీఆర్ఎస్ నేతల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ టైమ్ పాస్ నడుపుతున్నారంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేటీఆర్‌ను ఆరు గంటల పాటు విచారణ చేపట్టారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది లీకు వీరుల ప్రభుత్వమని, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామాలు నడుస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు ఈ తప్పుడు వార్తలను నమ్మొద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు.
సింగరేణిలో అక్రమాలు జరిగాయని హరీష్ ఆరోపిస్తే, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని కేటీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులతో పాట ప్రతిపక్ష నేతల ఫోన్లు ప్రస్తుతం ట్యాపింగ్ జరుగుతుందని సిట్ అధికారులను అడిగితే సమాధానం లేదన్నారు. మా వ్యక్తిత్వ హననానికి గురిచేసే వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోరని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను వేధింపులకే తప్ప.. సిట్ అడిగినదాంట్లో ఏమీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగి టైంపాస్ చేశారు. బాధ్యతగల ప్రతిపక్షంగా ఏ విచారణకైనా సహకరిస్తామని కేటీఆర్ తెలిపారు.
పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించానని, అవసరమైతే మరోసారి సెట్ ముందుకు వచ్చేందుకు సిద్ధమన్నారు కేటీఆర్. ట్యాప్ చేసి హీరోయిన్‌లను బెదిరించినట్లు వస్తున్న కథనాల్లో నిజామా? అని అడిగాను. హీరోయిన్‌పై కథనాలు అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారన్నారు. సీఎం అనుచరుడు 3 వందల కోట్ల టెండర్ గురించి గన్ పెట్టి బెదిరిస్తే కేసులు లేవని, మంత్రి కొడుకు భూ కబ్జాకు పాల్పడితే సిట్ ఎందుకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు.. ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఎందుకు లేదన్నారు. సీఎం, మంత్రుల సన్నిహితులు దోపిడీకి పాల్పడుతుంటే ఎందుకు సిట్ వేయరని నిలదీశారు. నన్ను ఒక్కరినే విచారణ చేశారన్న కేటీఆర్.. తారక రామారావు, సిట్ అధికారులు తప్ప ఎవరూ లేరన్నారు. మళ్లీ విచారణకు పిలిస్తే సహకరిస్తానని చెప్పాను’’ అని కేటీఆర్ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..