PGECET Counselling: రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం.ఫార్మసీ, ఫార్మ్-డీ ప్రవేశాలకు సంబంధించి పీజీఈసెట్ ప్రత్యేక విడత నోటిఫికేషన్‌ను సాంకేతిక విద్యామండలి విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు జనవరి 25వ తేదీన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలిపింది. అలాగే సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయడానికి ఈనెల 31వ తేదీ వరకు గడువు విధించింది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక.. ఫిబ్రవరి 2వ తేదీన అర్హుల జాబితాను ప్రకటించనున్నారు.
ఆ తరువాత 3, 4వ తేదీల్లో అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చునని అధికారులు తెలిపారు. 8వ తేదీన సీట్లు పొందిన వారి వివరాలను వెల్లడిస్తారు. ఇక కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీ లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. అలా రిపోర్ట్ చేయని వారి సీట్లను క్యాన్సిల్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
Also read: