సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా ఆమోదంపై హైకోర్టులో పిటిషన్.. వివరాలివే.!

సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ రీసెర్చ్ స్కాలర్లు ఆర్. సుబేందర్ సింగ్, జె శంకర్‌లు...

సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా ఆమోదంపై హైకోర్టులో పిటిషన్.. వివరాలివే.!

Updated on: Nov 18, 2021 | 6:07 PM

సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ రీసెర్చ్ స్కాలర్లు ఆర్. సుబేందర్ సింగ్, జె శంకర్‌లు రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు తమ పిల్‌లో పేర్కొన్నారు. ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని.. వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఎలక్షన్‌ కమిషన్, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను లంచ్ మోషన్‌గా స్వీకరించాలని సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి కోరగా.. ఇవాళ అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.