AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రేమించానన్నాడు.. శారీరికంగా కలిశాడు.. కట్ చేస్తే.. పిల్లాడు పుట్టేసరికి

ప్రేమించాడు.. అండగా ఉంటానన్నాడు. రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. సహజీవనం చేసి ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. కులం పేరుతో దూరం పెట్టి.. మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో నా బిడ్డకు.. నాకు.. న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేస్తోంది. ఈ ఘటన ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: ప్రేమించానన్నాడు.. శారీరికంగా కలిశాడు.. కట్ చేస్తే.. పిల్లాడు పుట్టేసరికి
Nalgonda News
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 02, 2025 | 12:26 PM

Share

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన రేణుకకు నకిరేకల్ మండలం నెల్లిబండకు చెందిన అశోక్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. పెండ్లైన కొన్నేళ్ళకు అశోక్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన విష్ణు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అశోక్ మృతితో అయోమయంలో ఉన్న రేణుకకు విష్ణు పరిచయమయ్యాడు. నీకు అండగా నేనుంటానని విష్ణు నమ్మబలికాడు. సహజీవనం చేస్తుండగా, తనను పెళ్లి చేసుకోవాలని రేణుక నిలదీయడంతో.. విష్ణు రహస్యంగా చెరువుగట్టు దేవస్థానంలో పెళ్లి చేసుకున్నాడు. ఇదే సమయంలో రేణుకకు తెలియకుండా విష్ణుకు తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి చేశారు.

వారిద్దరికీ ఇద్దరు పిల్లలు జన్మించారు. సహజీవనం చేస్తున్న రేణుకకు రెండుసార్లు అబార్షన్లు కూడా చేయించాడు. మూడోసారి అబార్షన్ చేసుకోవాలని విష్ణు.. రేణుకపై ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో రేణుక, విష్ణుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ససేమిరా అంటూ బిడ్డకు రేణుక జన్మనిచ్చింది. ఆ తర్వాత మనిద్దరి కులాలు వేరు అంటూ రేణుకకు దూరంగా విష్ణు ఉంటూ వచ్చాడు. నా బిడ్డకు.. నాకు న్యాయం చేయాలని నెల్లిబండలోని విష్ణు ఇంటి ఎదుట పసిపాపతో రేణుక ధర్నా చేస్తోంది. ఈ ఘటనపై గ్రామ పెద్ద మనుషులు సమక్షంలో పంచాయతీ నిర్వహిస్తున్నారు.

Follow Us
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?