తల్లి మృతితో తల్లడిల్లిన లేగదూడ.. స్థానికులను కలచివేసిన ఘటన!

తల్లి మృతితో లేగదూడ తల్లడిల్లింది. నోరు లేని ఆ మూగజీవి ఏమి జరిగిందో తెలియక అంబ అంబా అంటూ చనిపోయిన తల్లి ఆవు చుట్టూ తిరిగిన ఘటన స్థానికులను కలచి వేసింది. లేగ దూడ పిలిచే పిలుపులకు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.

తల్లి మృతితో తల్లడిల్లిన లేగదూడ.. స్థానికులను కలచివేసిన ఘటన!
Hindu Rituals After Cow Death

Edited By:

Updated on: May 17, 2025 | 1:14 PM

తల్లి మృతితో లేగదూడ తల్లడిల్లింది. నోరు లేని ఆ మూగజీవి ఏమి జరిగిందో తెలియక అంబ అంబా అంటూ చనిపోయిన తల్లి ఆవు చుట్టూ తిరిగిన ఘటన స్థానికులను కలచి వేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.

భద్రాచలం పుణ్యక్షేత్ర పట్టణంలో వెంకటేశ్వర కాలనీలో నిండు చూడుతో ఉన్న ఓ గోవు జన్మనివ్వడానికి ముందే మాయ బయటికి రావడంతో రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురై ఓ లేగదూడకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన రెండు రోజులకే ఆ తల్లి ఆవు ప్రాణాలు విడిచింది. అనారోగ్యంగా ఉన్న ఆవుకు స్థానికులు వైద్య చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరికి అందరూ చూస్తుండగానే కుప్పకూలిన ఆవు చనిపోయింది.

ఈ తల్లి ఆవు మృతి చెందడంతో లేగదూడ అంబా అని తల్లడిల్లుతూ తిరుగుతున్న దృశ్యం చూపరులను కన్నీరు పెట్టించింది. వెంటనే స్పందించిన కాలనీ వాసులతో పాటు వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు ఆవుకు కడసారి వీడ్కోలు ఘనంగా పలికారు. మృతి చెందిన గోవును శుద్ధి చేసి ఊరేగింపుగా గోదావరి వొడ్డుకు చేర్చి సమాధి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లిని విడవకుండా అంబా అంబా అంటూ అంత్యక్రియలు వద్దకు పరుగులు తీస్తూ వచ్చింది. కనిపించని తల్లి కోసం ఆ లేగదూడ తల్లడిల్లిపోయింది. లేగ దూడ పిలిచే పిలుపులకు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..