మత్తడి దూకిన చేపలు.. పండగ చేసుకుంటున్న ఊరి జనం.. ఎక్కడో కాదండోయ్..

|

Jul 27, 2024 | 1:52 PM

మత్స్య సంపద అంతా వరద నీటిలో కొట్టుకు పోతుండటంతో కరత్వాడ ప్రాజెక్టు నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు భారీగా నష్టం ఏర్పడుతోంది. మరోవైపు స్థానిక ప్రజలు మాత్రం చేతికి చిక్కుతున్న చేపలతో పండుగ చేసుకుంటున్నారు. ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులోని మత్స్య సంపదంత ఖాళీ అయ్యే ప్రమాదం ఉందంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మత్తడి దూకిన చేపలు.. పండగ చేసుకుంటున్న ఊరి జనం.. ఎక్కడో కాదండోయ్..
Fish
Follow us on

ఎగువన మహారాష్ట్రాలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. జలపాతాలు ఉగ్ర రూపం దాల్చి జల హోరుతో కనిపిస్తున్నాయి. బోథ్ నియోజకవర్గ పరిధిలోని కుంటాల పొచ్చెర గాయత్రి జలపాతాలకు భారీగా వరద పోటెత్తుతుంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు నిండుకుండలా మారి పాలనుర గలు కక్కుతూ మత్తడి దూకుతుంది. భారీ వరద నేపథ్యంలో ప్రాజెక్టులో అలుగు పారి చేపలు మత్తడి దూకుతున్నాయి. దీంతో కరత్వాడ ప్రాజెక్టు వద్ద చేపల జాతర కనిపిస్తోంది.

చేపలను పట్టుకునేందుకు బోథ్ మండల పరిధిలోని చుట్టు పక్క గ్రామాల ప్రజలు కరత్వాడ ప్రాజెక్టు వద్దకు క్యూ కడుతున్నారు. 10 నుండి 20 కిలోల బరువున్న చేపలు మత్తడు దూకి వరద నీటిలో కిందికి కొట్టుకు వస్తుండటంతో చేపల కోసం జనం ఎగబడుతున్నారు‌. మత్స్య సంపద అంతా వరద నీటిలో కొట్టుకు పోతుండటంతో కరత్వాడ ప్రాజెక్టు నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు భారీగా నష్టం ఏర్పడుతోంది. మరోవైపు స్థానిక ప్రజలు మాత్రం చేతికి చిక్కుతున్న చేపలతో పండుగ చేసుకుంటున్నారు. ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులోని మత్స్య సంపదంత ఖాళీ అయ్యే ప్రమాదం ఉందంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…