Revanth Reddy: నిర్మల్ నుండే కాంగ్రెస్ ప్రభంజనం యాత్ర షురూ.. చమురు,వంట గ్యాస్ ధరల పెంపు సామాన్యుల నడ్డీ విరుస్తోందిః రేవంత్

పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

Revanth Reddy: నిర్మల్ నుండే కాంగ్రెస్ ప్రభంజనం యాత్ర షురూ.. చమురు,వంట గ్యాస్ ధరల పెంపు సామాన్యుల నడ్డీ విరుస్తోందిః రేవంత్
Revanth Reddy

Updated on: Jul 12, 2021 | 9:52 PM

PCC Chief Revanth Reddy participate in Congress Party protest: పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపుతో పెట్రోల్ డీజీల్ రేట్ల పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు సైకిళ్లు, ఎడ్ల బండ్లు, రిక్షాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్ ధర లీటర్కు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 రూపాయలు ఉందన్నారు. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర 71రూపాయలు ఉంటే.. ఇప్పుడు అది 105 రూపాయలకు చేరిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కాగా, రాంజీ గోండు , కొమురంభీం స్పూర్తితో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కోసం నిర్మల్ నుండే కాంగ్రెస్ ప్రభంజనం యాత్ర షురూ చేశానని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌కు అదికారం కొత్త కాదు.. నిమ్న వర్గాల క్షేమం కోసమే తమ పోరాటమన్నారు. అదికారం కోసం తహతహలాడుతూ అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ ప్రజల జేబులు లూటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెరిగిన పెట్రోల్ , డీజీల్ , వంట గ్యాస్ ధరలు సామాన్యుల నడ్డీ విరుస్తున్నాయన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లంటూ కేసీఆర్ డబుల్ అభివృద్ది అంటూ ప్రధాని మోదీ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఏడేళ్లు అదికారం దూరంగా ఉన్నా మా మీద ఇంత ప్రేమ చూపెడుతున్న మీకు అండగా ఉంటామన్నారు.

అటు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో ఎద్దుల బండి లాగి నిరసన తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ,డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్,డీజీల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిస్తోందని ఆరోపించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పన్నులు పెంచుతు పేద ప్రజల పై అదనపు భారం మోపుతున్నారన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని.. దేశ ప్రజలు ఏనాడూ లేనంత ఆర్ధిక భారాన్ని మోస్తున్నారన్నారు. భవిష్యత్ లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు.

Jaggareddy

Read Also….  Damodara Rajanarsimha: కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలో అపశృతి.. ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మాజీ డిఫ్యూటీ సీఎం