కోట్లాది మంది త్యాగాల ఫలం మన తెలంగాణ-పవన్ కల్యాణ్

pawan kalyan twitte : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈరోజు చారిత్రాత్మకమైనది. కోట్లాది మంది కల సాకరమైన రోజు. దశాబ్దాల కోరిక నెరవేరిన రోజు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ జన్మించిన రోజు. వేలాది మంది బలిదానాలు, కోట్లాది మంది త్యాగాల ఫలం మన తెలంగాణ. తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు అంజలి ఘటిస్తున్నా. ఈ మహత్కార్యం సాకారం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ జేజేలు పలుకుతున్నాను’’ […]

కోట్లాది మంది త్యాగాల ఫలం మన తెలంగాణ-పవన్ కల్యాణ్

Updated on: Jun 02, 2020 | 1:40 PM

pawan kalyan twitte : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈరోజు చారిత్రాత్మకమైనది. కోట్లాది మంది కల సాకరమైన రోజు. దశాబ్దాల కోరిక నెరవేరిన రోజు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ జన్మించిన రోజు. వేలాది మంది బలిదానాలు, కోట్లాది మంది త్యాగాల ఫలం మన తెలంగాణ. తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు అంజలి ఘటిస్తున్నా. ఈ మహత్కార్యం సాకారం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ జేజేలు పలుకుతున్నాను’’ అని జనసేనాని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దినదిన ప్రవర్థమానం అవ్వాలని, తిరుగులేని శక్తిగా నిలవాలని కోరుకుంటున్నట్టు పవన్‌ కళ్యాణ్ అన్నారు.