Hyderabad Rains: హైదరాబాద్ మహానగరంలో మేఘం గర్జించింది. ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది. ఇప్పటికీ కురుస్తూనే ఉంది. గంటలో పది సెంటీమీటర్లకు పైగా కురిసిన వర్షానికి అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. మూసారంబాగ్, ఆసిఫ్‌నగర్, గుడిమల్కాపూర్, టోలీచౌకీ(Toli Chowki)లో రోడ్లు జలమయం అయ్యాయి. నాంపల్లి, మల్లేపల్లి, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మలక్‌పేట్‌లో వర్షం బీభత్సం సృష్టించింది నాంపల్లిలో 9 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 5 సెంటీమీటర్ల వాన కురిసింది. దీంతో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీసులతో పాటు GHMC సూచించింది. PV ఎక్స్‌ప్రెస్‌వేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోమవారం కురిసిన వాన ట్రయలర్ మాత్రమే అని వెదర్ ఎక్స్‌పెర్ట్స్ చెబుతున్నారు. రానున్న 28-30రోజుల పాటు అతిభారీ వర్షం కురుస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే కొన్ని గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, కామారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అక్కడ అధికారులను కూడా వెదర్ డిపార్ట్‌మెంట్ అలర్ట్ చేసింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 26, 2022
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 26, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..