
తానెక్కడున్నానో కూడా తెలియని స్థితిలో ఇంటికొచ్చాడు. ఏకంగా ఐదేళ్ల నుంచి కోమాలోనే గడుపుతున్నాడు. తన కొడుకు లేవకపోతాడా, మాములుగా కాలేకపోతాడా అని అతడి తల్లిదండ్రులు..తన భర్త మాములు మనిషి అవుతాడని భార్య.. నాన్న లేచి తనతో మాట్లాడుతాడని ఐదేళ్ల కొడుకు కళ్లల్లో వత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. అందరినీ కదితిస్తున్న ఆ వ్యక్తి కథేంటి ఓసారి చూసొద్దాం పదండి.
ఇదిగో ఐదేళ్లుగా మంచానికే పరిమితమై కోమాలోనే ఉన్న ఇతడి పేరు పైండ్ల రాజు. ఇతనిది కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గోపాల్ రావు పేట గ్రామం. అయితే ఐదేళ్ల కిందట బంధువుల శుభక్యారం ఉండడంతో కొత్తపల్లి మండలం బావుపేటకు రాజు బైక్ తీసుకొని వెళ్లాడు. కార్యం చూసుకుని తిరిగివస్తుండగా… బావుపేట వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాజు తలకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో అతన్ని కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలవ్వడంతో రాజు కోమాలోకి వెళ్లాడు. పదిహేను రోజుల పాటు హాస్పిటల్‌లో ఉంచినా రాజు కోలుకోలేదు. అప్పటికే ఉన్న భూములన్ని అమ్మి సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా ఎలాంటి లాభం లేకపోయింది. దీంతో ఇంకా రాజును ఆసుపత్రిలో ఉంచే స్థోమత లేక అతన్ని ఇంటికి తీసుకొచ్చారు కుటుంబసభ్యులు. ఐదేళ్ల నుంచి రాజుకు ముక్కు ద్వారానే జ్యూస్, వాటర్ వంటివి అందిస్తూ.. బట్టతో శరీరాన్ని శుభ్రపర్చడం చేస్తున్నారు. నెలకు మందులకే ఆరేడు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంతే కాకుండా రాజును నెలకు ఒక్కసారి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇంట్లోనే ఉంచుకొని గత ఇదేళ్లుగా కోమాలో ఉన్న రాజును కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
అయితే రాజుకు కొన్నేళ్ల క్రితమే నవ్య అనే ఆమెతో వివాహం జరిగింది.వీరిద్దరికి ఇప్పుడు ఐదేళ్ల కొడుకు కూడా న్నాడు. పిల్లాడికి మూడు నెలల వయసున్నప్పుడే రాజుకు యాక్సిడెంట్‌కు గురై కోమాలోకి వెళ్లాడు. నాన్నను రోజూ మంచంలో చూస్తూ పెరిగిన కొడుకు తన తండ్రి ఎప్పుడు లేస్తాడా అని ఎదురుచూస్తున్నాడు. కొడుకుతో పాటు భార్య నవ్య, అతని తల్లిదండ్రులు చిలుకమ్మ, హనుమాండ్లు రాజు ఎప్పుడు మామూలు మనిషి అవుతాడు, ఎప్పుడు తమతో కలిసి హాయిగా ఉంటారో అని కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.
నోట్.. రాజు భార్య నవ్య అకౌంట్ వివరాలు.
P.Navya
Account Number.017310100183221
IFC..UBIN0801749
Gopalraopeta Branch
Union Bank.
Ramadu Mandalam
Karimnagar District
Telangana.
Phone- +917893588618
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..