పరకాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ నేతల దాడులతో ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది. ఎమ్మెల్యే భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా టీఆర్‌ఎస్ ఇచ్చిన పరకాల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పాల్పడిన కేసులో 33 మంది బీజేపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు వరంగల్ వెళ్తున్ బీజేపీ నేతలు పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. హన్మకొండలో బీజేపీ నేతలను పరామర్శించేందుకు వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
భువనగిరిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. భూదాన్‌పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌కి రాజాసింగ్‌ను తరలించారు. అటు జనగామ దగ్గర ఎండల లక్ష్మీనారాయణ, మాజీమంత్రి పెద్దిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా…ఆలేరు దగ్గర జితేందర్‌రెడ్డి, విజయరామారావు అదుపులోకి తీసుకున్నారు.