AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palla Rajeshwar reddy: ‘ఆత్మగౌరవం కాదు.. అక్రమాస్తుల రక్షణకే’… ఈట‌ల వ్యాఖ్యల‌కు ప‌ల్లా కౌంట‌ర్

టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ అనామకుడు...

Palla Rajeshwar reddy:  'ఆత్మగౌరవం కాదు.. అక్రమాస్తుల రక్షణకే'... ఈట‌ల వ్యాఖ్యల‌కు ప‌ల్లా కౌంట‌ర్
Palla Comments
Ram Naramaneni
|

Updated on: Jun 04, 2021 | 3:21 PM

Share

టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ అనామకుడు ఇచ్చిన ఫిర్యాదుతో రాత్రికి రాత్రే తానను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశాని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌కు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఆత్మ‌గౌర‌వం కోసం కాదు.. ఆస్తుల ర‌క్ష‌ణ కోస‌మే ఈట‌ల ప్ర‌య‌త్నస్తున్నారని పల్లా ఆరోపించారు. ఆయ‌న‌కు ఆత్మ‌గౌర‌వం ఉంటే.. పేద‌ల ఆస్తుల‌ను అక్ర‌మంగా ఆక్ర‌మించేవారు కాదు అని ప‌ల్లా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న ఎంతో మందిని కేసీఆర్ నాయ‌కులుగా త‌యారు చేశారు. ఎంతో మంది బ‌య‌ట‌కు వెళ్తూ కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఈట‌ల కూడా అదే చేశారు. క‌న్న‌త‌ల్లి లాంటి పార్టీపై ఈట‌ల అభాండాలు వేశారని పల్లా ధ్వజమెత్తారు. ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టే అనామ‌కుడు ఇచ్చిన ఫిర్యాదుపై సీఎం కేసీఆర్ స్పందించారని పల్లా పేర్కొన్నారు. అన‌వ‌స‌రంగా నోరు పారేసుకుంటే.. సూర్యుడిపై ఉమ్మేసిన‌ట్టేనని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ప్ర‌జ‌లంద‌రూ టీఆర్ఎస్ వైపే ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. రైతు బంధు ప‌థ‌కం మీద ఈట‌ల వ్యాఖ్య‌లు అర్థ‌ర‌హితం అన్నారు.

ఈట‌ల‌ను టీఆర్ఎస్ పార్టీ ఎంతో గౌర‌వించింది అని పల్లా తెలిపారు. శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా అవ‌కాశం ఇచ్చారు. రెండుసార్లు మంత్రిని చేశారు. అవ‌కాశం ఇచ్చారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి రానివ్వ‌కుంటే అప్పుడే ఎందుకు రాజీనామా చేయ‌లేదన్నారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌పై నిజంగా ప్రేమ ఉంటే వారి భూములు ఎందుకు ఆక్ర‌మించారని పల్లా ప్రశ్నించారు.

Aslo Read: టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా.. పదవులు త్రుణప్రాయ‌మంటూ ఘాటు వ్యాఖ్య‌లు

పంట పండినా కంట‌త‌డే.. ఇవీ కార‌ణాలు.. ఆదుకునే నాథుడేడి?

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే