పద్మశ్రీతో మురిసిన మర్లవాయి.. గుస్సాడి కళాకారుడు కనకరాజు స్వగ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు

దశాబ్దాలుగా ఆదివాసీల అరుదైన కళ గుస్సాడీకి ప్రాణం పోస్తున్న మర్లవాయికి చెందిన కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో అయన స్వగ్రామంలో..

పద్మశ్రీతో మురిసిన మర్లవాయి.. గుస్సాడి కళాకారుడు కనకరాజు స్వగ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు

Updated on: Jan 26, 2021 | 12:17 PM

తెలంగాణ ఆదివాసీ బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ లోని కొమురంభీం జిల్లా మర్లవాయి ఆదివాసీ కళాకారుడికి పద్మశ్రీ పురస్కారం వరించింది. దశాబ్దాలు గా ఆదివాసీల అరుదైన కళ గుస్సాడీకి ప్రాణం పోస్తున్న మర్లవాయికి చెందిన కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో అయన స్వగ్రామంలో అర్థరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం పద్మా పురస్కారాలను ప్రకటించడం… కళల కోటాలో కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో మర్లవాయి మురిసిపోతుంది. పద్మశ్రీ అవార్డు దక్కడంతో కనకరాజు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందిరగాందీ నుండి కేసీఆర్ వరకు మహామహా నేతల సమక్షంలో తమ కళను ఆవిష్కరించానని.. ఎన్నో అవార్డులు అందుకున్నాని.. ప్రస్తుతం పుట్టిన ఊరు మర్లవాయిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నానని వివరించారు కనకరాజు.

తెలంగాణ నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్న ఏకైక ఆదివాసీ కనకరాజు కావడం మరో విశేషం. మర్లవాయి ఆదివాసీ పితామహుడు హైమన్ డార్ఫ్‌ దంపతులు నడయాడిన నేల కావడం మరో విశేషం.