Telangana: బీజేపీ టికెట్ల కోసం తీవ్రమైన పోటీ.. వారం రోజుల్లోనే ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే

|

Sep 12, 2023 | 2:26 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ప్రక్రియ నడుస్తేంది. అలాగే కమలం పార్టీ కూడా ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బీజేపీ ఊహించని విధంగా దరఖాస్తులు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సామాన్య కార్యకర్తలు కూడా టికెట్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు.

Telangana: బీజేపీ టికెట్ల కోసం తీవ్రమైన పోటీ.. వారం రోజుల్లోనే ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే
Telangana BJP
Follow us on

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ప్రక్రియ నడుస్తేంది. అలాగే కమలం పార్టీ కూడా ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బీజేపీ ఊహించని విధంగా దరఖాస్తులు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సామాన్య కార్యకర్తలు కూడా టికెట్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అప్లికేషన్లనకు ఎలాంటి ఫీజు లేకపోవడంతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే అంచనాకు మించి ఇన్నివేల దరఖాస్తులు రావడంతో ఇప్పుడు బీజేపీ కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.

వచ్చినటువంటి అప్లికేషన్లను వడపోసేందుకు ఇప్పడు కమలం పార్టీ నేతలకు సమస్యగా మారింది. 119 నియోజకవర్గాల కోసం అభ్యర్థులను ఎలా ఎంపిక చేయాలి.. ఎవరికి టీకెట్ ఇవ్వాలి.. ఒకే సీటుకు ఎక్కువ మంది పోటిపడుతున్న చోట్ల ఎలా వ్యవహరించాలి.. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరిని ఎలా నచ్చజెప్పాలన్న దానిపై నేతలు తలలు పట్టుకొని కూర్చొన్నారు. అయితే ఇంతవరకు అప్లికేషన్ పరిశీలనకు కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. అయితే త్వరలోనే కమిటీ ఏర్పాటు చేసి నియోజకవర్గానికి రెండు మూడు పేర్లను ఎంపిక చేసి హైకమాండ్‌కు పంపించే యోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. బీజేపీలో తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్‌తో పాటు రాజ్యసభ ఎంపీగా ఉన్న లక్ష్మణ్ కొనసాగుతున్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోలేరు.

అంతేకాదు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్, వివేక్ వెంకటస్వామి సహా మరికొందరు దరఖాస్తు చేసుకోలేదు. ప్రస్తుతం బీజేపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ సస్పండ్ చేసింది. అయితే దుబ్బాక ఎమ్మెల్యే అయిన రఘునందన్ రావు మాత్రమే అప్లికేషన్ ఇచ్చారు. ఇక మరోవైపు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంధర్ కూడా ఇంతవరకు దరఖాస్తు చేసుకోలేదు. అయితే ఈ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నట్లు విమర్శలు కూడా వస్తున్నాయి. సామన్య కార్యకర్తలకే దరఖాస్తులా.. కీలక నేతలకు ఎలాంటి అప్లికేషన్లు లేవా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే కీలక నేతలు ఇంతవరకు ఎందుకు దరఖాస్తులు చేసుకోలేదు అన్న విషయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సర్వే ఆధారంగా టికెట్ ఇస్తారా లేక.. ధన బలం చూసి ఇస్తారా అనేది ఆసక్తిగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి