Osmania University: పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ సిపిజిఇటి – 2021 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఇతర పీజీ కోర్సులకు సంబంధించి 2021-2022 విద్యా సంవత్సరానికి గానూ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. కాగా, టిఎస్‌సిహెచ్ఈ ఆధ్వర్యంలో ఓయూ రాష్ట్రస్థాయి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. డిగ్రీ, ఇంటర్మీడియట్‌లో చివరి సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన లేదా హాజరైన అభ్యర్థులు సిపిజిఇటి – 2021కి అప్లై చేసుకోవడానికి అర్హులు. కాగా, సిపిజిఇటి-2021 లో పీజీ కోర్సులు.. ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంసీజే, ఎంఎల్ఐబి, ఎంఈడి, ఎంపీఈడీ మొదలైన కోర్సులతో పాటు.. పీజీ డిప్లోమా కోర్సులు, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు దరఖాస్తులు కోరుతోంది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ మేరకు ఓయూ అధికారులు బుధవారం నాడు ప్రకటన జారీ చేశారు. కాగా, ఈ ప్రవేశ పరీక్షను కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్(సిబిటి) ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. ఈ ప్రకటనలో అప్లికేషన్ ఫీజ్‌ను కూడా ప్రకటించారు. ఒక సబ్జెక్టుకు రిజిస్ట్రేషన్ ఫీజు ఓసి, బీసీ అభ్యర్థులకు రూ .800, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అభ్యర్థులకు రూ .600 లు గా నిర్ణయించారు. ఇక ప్రతీ అదనపు సబ్జెక్టుకు అన్ని వర్గాలకు రుసుము రూ. 450 గా నిర్ణయించారు. ఏదైనా టీఎస్/ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలలో చెల్లించవచ్చునని సిపిజిఇటి-2021 కన్వీనర్ వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ అయిన.. www.osmania.ac.in www.cpget.tsche.ac.in, www.tscpget.com www.ouadmissions.com ల సందర్శించి తెలుసుకోవచ్చునని తెలిపారు.
Also read:
TS ECET 2021: టీఎస్ ఈసెట్ పరీక్ష తేదీ ఖరారు.. రేపటి నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు..