Osmania University Exams: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2021 మార్చి/ ఏప్రిల్‌లో జరగాల్సిన యూజీ(సిబిఎస్‌సి) 3, 4వ సెమిస్టర్(రెగ్యూలర్) పరీక్షల రీషెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు బుధవారం నాడు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అండర్ గ్రాడ్యూయేట్(బీఏ, బికామ్, బిఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ) కోర్సులకు సంబంధించి 3, 4వ సెమిస్టర్ పరీక్షల రీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. జులై8, 2021 నుంచి రీషెడ్యూల్ పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇదికూడా చదవండి: తెలంగాణ ఎడ్‌సెట్-2021 దరఖాస్తుల సమర్పణకు గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..
అలాగే గతంలో జారీ చేసిన హాల్ టికెట్లనే విద్యార్థులు తీసుకురావాలని, కొత్తగా హాల్ టికెట్ జారీ చేయడం లేదని స్పస్టం చేశారు. ఇక పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లందరూ పరీక్షల నిర్వహణలో కోవిడ్ -19 ప్రోటోకాల్స్ అండ్ స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్(ఎస్ఓపి)ని ఖచ్చితంగా పాటించాలని యూనివర్సిటీ అధికారులు సదరు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ప్రిన్సిపాల్స్, విద్యార్థులు సహకరించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉస్మానియా యూనివర్సిటీ కోరారు. ఇదికూడా చదవండి: ఎవరో ఆర్డర్ ఇస్తే వినాల్సిన అవసరం లేదు.. ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం