Weather Update: తెలంగాణకు ఆరెంజ్‌ అలెర్ట్‌.. మరో మూడు రోజులపాటు వడగళ్ల వానలు.. ఈదురుగాలులు

|

Apr 25, 2023 | 9:22 PM

వారం రోజుల పాటు హీట్‌వేవ్‌ పరిస్థితులు ఉండబోవని, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులుంటాయ‌ని వెల్ల‌డించారు. వెస్ట్రన్‌ డిస్టబెన్స్‌ ఈశాన్య రాజస్థాన్‌, సెంట్రల్‌ మధ్యప్రదేశ్‌, తమిళనాడులోని దక్షిణ ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

Weather Update: తెలంగాణకు ఆరెంజ్‌ అలెర్ట్‌.. మరో మూడు రోజులపాటు వడగళ్ల వానలు.. ఈదురుగాలులు
Rainfall
Follow us on

తెలంగాణలో రాగల మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ పలు జిల్లా ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది.

పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో.. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి వడగళ్ల వానలు కురుస్తాయని అధికారులు వెల్ల‌డించారు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేశారు.

మరో వైపు, రాగల ఆరు రోజులు చాలా ప్రాంతాల్లో హీట్‌వేవ్‌ పరిస్థితుల నుంచి ఉపశమనం కలుగుతుందని అధికారులు తెలిపారు. వారం రోజుల పాటు హీట్‌వేవ్‌ పరిస్థితులు ఉండబోవని, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులుంటాయ‌ని వెల్ల‌డించారు. వెస్ట్రన్‌ డిస్టబెన్స్‌ ఈశాన్య రాజస్థాన్‌, సెంట్రల్‌ మధ్యప్రదేశ్‌, తమిళనాడులోని దక్షిణ ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..