Komatireddy: సంచలనంగా మారిన ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్.. ప్రతిపక్షాల రివర్స్ ఎటాక్ తో పొలిటికల్ వార్..

|

Feb 14, 2023 | 3:58 PM

తెలంగాణ రాజకీయాల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఅర్.. కాంగ్రెస్‌ పార్టీతో కలవక తప్పదనే కామెంట్స్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ..

Komatireddy: సంచలనంగా మారిన ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్.. ప్రతిపక్షాల రివర్స్ ఎటాక్ తో పొలిటికల్ వార్..
Komatireddy Venkat Reddy
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఅర్.. కాంగ్రెస్‌ పార్టీతో కలవక తప్పదనే కామెంట్స్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతలు కూడా స్పందించడం మరింత కాక రేపుతోంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదని విమర్శించారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో వారికే తెలియదని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు.. బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్‌ కూడా రియాక్ట్ అయ్యారు. ‘తెలంగాణలో హంగ్‌ వచ్చే ఛాన్స్‌ లేదు. బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు పొత్తుల కోసం చూస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా.. తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని వెల్లడించారు. కాంగ్రెస్ గాడిన పడుతోందన్న కోమటి రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కీలకం కాబోతోందని వివరించారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు కూడా రావు. ఆ పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలవడం ఒక్కటే బీఆర్‌ఎస్‌కు ఉన్న మార్గం. అందుకే వచ్చే ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులు లేకపోయినా ఫలితాల తర్వాత మాత్రం కచ్చితంగా పొత్తులతో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ కాంగ్రెస్‌లో ఐక్యత లేకపోవడమే ప్రధాన సమస్య. సీనియర్ అయినా, జూనియర్ అయినా.. గెలిచే సత్తా ఉన్న వాళ్లకే టికెట్లు ఇవ్వాలి.

ఇవి కూడా చదవండి

     – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం