Online Cheating : హార్డ్‌ డిస్క్‌ అడ్డర్ పెడితే వచ్చిన పార్సిల్ చూసి షాక్ అయిన కస్టమర్.. ఇంతకు అందులో ఏమున్నాయంటే..

|

Apr 07, 2021 | 3:04 PM

ఆన్‌లైన్ మోసాలు పెరిగాయి. ఆర్డర్‌ ఇచ్చిన వస్తువు ఇంటికి చేరే వరకు గ్యారెంటీ లేకుండా పోతోంది. కడప జిల్లాలో తాజాగా జరిగిన ఘటన కలకలంరేపింది. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ అవసరమై ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసిన ఓ వ్యక్తికి ఊహించని షాక్‌ ఎదురైంది

Online Cheating : హార్డ్‌ డిస్క్‌ అడ్డర్ పెడితే వచ్చిన పార్సిల్ చూసి షాక్ అయిన కస్టమర్.. ఇంతకు అందులో ఏమున్నాయంటే..
Online Order
Follow us on

Online Cheating : ఆన్‌లైన్ మోసాలు పెరిగాయి. ఆర్డర్‌ ఇచ్చిన వస్తువు ఇంటికి చేరే వరకు గ్యారెంటీ లేకుండా పోతోంది. కడప జిల్లాలో తాజాగా జరిగిన ఘటన కలకలంరేపింది. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ అవసరమై ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసిన ఓ వ్యక్తికి ఊహించని షాక్‌ ఎదురైంది. ఆ పార్శిల్‌లో హార్డ్ డిస్క్‌కు బదులుగా వచ్చిన వస్తువులు చూసి సదరు వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు.

బద్వేలు స్థానిక రెడ్డయ్య మఠం వీధికి చెందిన ప్రదీప్‌ అనే వ్యక్తి కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ అవసరమై ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేశాడు. సిద్దవటం రోడ్డులోని సర్వీసు సెంటర్‌కు మంగళవారం పార్సిల్‌ వచ్చింది. అతడు 3,099 డబ్బు చెల్లించి పార్శిల్ తీసుకున్నాడు. అనుమానంతో ఆ పార్సిల్ ఓపెన్ చేస్తూ వీడియో తీశాడు. పార్శిల్‌లో రెండు బట్టల సబ్బులు ఉండటాన్ని చూసి దిమ్మ తిరిగింది. హార్డ్‌ డిస్క్‌కు బదులు సబ్బులు పంపించారని.. చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని బాధితుడు కోరగా, తమకు సంబంధంలేదని పార్సిల్‌ సర్వీసు నిర్వాకుడు తేల్చిచెప్పాడు. దీంతో చేసేది లేక బాధితుడు స్థానిక పోలీసులను ఆశ్రయించి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. అతడి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

అప్జల్ గంజ్ టైర్ల గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

Rakeshwar Singh: జవాన్ రాకేశ్వర్ సింగ్ సురక్షితం.. ఫొటోను విడుదల చేసిన మావోయిస్టులు..