Mallanna swamy Temple Mujgi: నిర్మల్ మండలంలోని ముజ్గి మల్లన్న ఆలయంలో నిర్వహించిన రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. రథోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న తొక్కీసలాటలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అసలేం జరిగిందంటే.. రథోత్స అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఒక్కసారిగా రథం లాగడంతో ముందున్న వారికి రథం తగిలి ఒక్కసారిగా కిందపడిపోయారు. బందోబస్తులో ఉన్న మహిళ కానిస్టేబుల్ తో పాటు ఇద్దరు భక్తులకు గాయాలయ్యాయి. స్వల్ప తొక్కిశాలట చోటు చేసుకుంది. మహిళ కానిస్టేబుల్ నందినిని అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మల్లేష్ అనే భక్తుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అక్కాపూర్ గ్రామానికి చెందిన భూమేష్ అనే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. అయిదు రోజుల ఉత్సావాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని రథోత్సవం నిర్వహించడం అనావాయితీగా వస్తోంది. జాతర పురస్కరించుకొని భక్తులు తులాభారంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు నిర్మల్ జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Also read: