ద్విచక్ర వాహనం బట్టల షాపులోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని రావిచెట్టు బజార్‌లోని వస్త్ర దుకాణంలోకి ఓ ద్విచక్ర వాహనం దూసుకెళ్లింది. దీంతో దుకాణంలో ఉన్నవారు ఒకేసారిగా షాక్‌కు గురయ్యారు. బైక్ దూసుకురావటంతో వారు ఒకేసారి భయకంపితులయ్యారు. ప్రమాద సమయంలో షాపులో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఉన్నారు.
మహిళలు దుకాణంలో బట్టలు కొనేందుకు వచ్చారు. దుకాణ యజమాని వారికి బట్టలు చూపిస్తున్నాడు. ఇంతలో దుకాణంలోకి బజాబ్ పర్సర్ బండి దూసుకొచ్చింది. బండి కౌంటర్‌ను ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడు ఎగిరిపడ్డాడు. ద్విచక్ర వాహనదారుడితోపాటు దుకాణంలో ఉన్న ముగ్గురికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇయితే ఈ దృశ్యాలు షాపులోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్రేక్‌లు పేలవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
Read Also.. TS Politics: కేసీఆర్ మోసాలకు త్వరలోనే చరమగీతం పాడతాం.. ఎమ్మెల్యే ఈటెల విమర్శలు..