Medaram: మేడారం జాతరకు సర్వం సిద్ధం.. ఈసారి ఎన్నో ప్రత్యేకతలు..
వనదేవతలను భక్తులు ప్రశాంతంగా దర్శించుకునేలా క్యూ లైన్లు పెంచారు. జంపన్న వాగులో భక్తులు స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున షవర్లు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు 4000 మంది కార్మికులను నియమించారు. జాతర కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 6 వేల బస్సులను మేడారానికి నడుపుతుంది...

ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక, సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే జాతరకు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. జాతరకు ముందు నుంచే పెద్ద సంఖ్యలో మేడారానికి భక్తులు తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో ఇవాళ మేడారంకు భక్తులు పోటెత్తారు. జాతరకు దేశంలోని వివిద ప్రాంతాల నుంచి మొత్తం సుమారు రెండు కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వనదేవతలను భక్తులు ప్రశాంతంగా దర్శించుకునేలా క్యూ లైన్లు పెంచారు. జంపన్న వాగులో భక్తులు స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున షవర్లు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు 4000 మంది కార్మికులను నియమించారు. జాతర కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 6 వేల బస్సులను మేడారానికి నడుపుతుంది ప్రభుత్వం. ఈబస్సులను ఈ నెల 18 నుంచి 26 వరకు బస్సులను నడుపుతున్నారు. ఇందుకు 9 వేల మంది సిబ్బందిని నియమించారు. మేడారంలో 55 ఎకరాల విస్తీర్ణంలో తాతాలిక బస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
ఇక మేడారం జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. జాతరకు వెళ్లే దారులన్నీంటిని పోలీసులు పహారా కాస్తున్నారు. 4,800 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఐదుగురు ఐఏఎస్‌ల పర్యవేక్షణలో మావోయిస్టు యాక్షన్ టీంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. VIP, VVIPలకు ఎలాంటి ఢోకా లేదంటున్నారు పోలీసులు. ఇక జాతర కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
4,800 సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. జాతరను ఐదుగురు ఐఏఎస్‌ల పర్యవేక్షిస్తున్నారు. అలాగే మావోయిస్టు యాక్షన్ టీంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మేడారం జాతరలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఖాకీలు డేగ కన్ను వేశారు. వీఐపీ, వీవీఐపీలకు ఎలాంటి ఢోకా లేకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
