Telangana: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోదాములపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. ఈ దాడుల్లో తెలంగాణలో అనుమతి లేని ఆశీర్వాద్ గోదుమ పిండికి సంబంధించిన భారీ నిల్వలు లభ్యమయ్యాయి. అక్రమంగా నిల్వ ఉంచిన అనుమతి లేని ఆశీర్వాద్ గోదుమ పిండి నిల్వలను అధికారులు పట్టివేశారు. గంజ్ ఏరియా గోదాముల్లో అనుమతి లేని గోదుమ పిండి నిల్వలు ఉంచినట్లు అదికారులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. దాడులు నిర్వహించారు. జేజే ట్రేడర్స్‌కు చెందిన గోదాముల్లో 18 క్వింటాళ్ల 60 కిలోలు, రూపేష్ అగర్వాల్, రాజేష్ వట్టెం వార్‌కు చెందిన గోదాముల్లో 7 క్వింటాళ్ల 70 కిలోలు నిల్వ ఉంచిన అక్రమ అశీర్వాద్ గోదుమ పండిని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఇదికూడా చదవండి:ప్రమాదంలో సముద్రపు ఆవులుగా చెప్పుకునే మనాటీల మనుగడ..జంతు ప్రేమికుల్లో ఆందోళన.
కాగా, జిల్లా కేంద్రంలో టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో భాగంగా మహారాష్ట్రలో మాత్రమే అమ్మకాలు సాగించాల్సిన ఆశీర్వాద్ గోదుమ పిండి నిల్వలను గుర్తించారు అధికారులు. ఈ అనుమతి లేని గోదుమ పిండిని విక్రయించడం వలన ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఆ కారణంగానే వీటి విక్రయాలు తెలంగాణలో నిషేధించడం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా, ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదికూడా చదవండి: కరోనా ఎవరికి ఎక్కువ సోకుతోందన్న దానిపై సూర్యాపేట మెడికల్ కాలేజీ వైద్య బృందం సరికొత్త విషయాలు.
Also read:
AP CM YS Jagan: ఆ టీకాలను రాష్ట్రాలకు కేటాయించండి.. ప్రధాని మోదీని కోరిన సీఎం వైఎస్ జగన్