T Congress: టీ కాంగ్రెస్‌లో బెంజ్‌ కారు చిచ్చు.. బీజేపీ నేత ఆరోపణల్లో నిజమెంత.?

తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీకి తెలంగాణ కాంగ్రెస్‌ నేత మెర్సిడెస్‌ బెంజ్‌ కారు ఇచ్చారంటూ బీజేపీ నేత NVSS ప్రభాకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఆయన మరో బాంబు కూడా పేల్చారు. ఏ డేట్‌లో ఆమెకి కారు అందజేశారో, కారు తాళాలు ఎవరు ఇచ్చారో తన దగ్గర ప్రూఫ్స్‌ ఉన్నాయంటూ...

T Congress: టీ కాంగ్రెస్‌లో బెంజ్‌ కారు చిచ్చు.. బీజేపీ నేత ఆరోపణల్లో నిజమెంత.?
Congress

Updated on: Feb 20, 2024 | 12:37 PM

టీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జికి బెంజి కారు ఇచ్చిన కాంగ్రెస్‌ నేత ఎవరు? ఈ సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ నేత NVSS ప్రభాకర్‌ మాత్రం తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. కారు ఇచ్చిన డేటు, ప్లేసు కూడా చెబుతానంటూ NVSS చేసిన ఘాటు కామెంట్లతో ఫైట్‌ మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య కారు చిచ్చు రాజుకుంది. ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో తుఫాన్‌ రేపుతున్నాయి. NVSSపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీకి తెలంగాణ కాంగ్రెస్‌ నేత మెర్సిడెస్‌ బెంజ్‌ కారు ఇచ్చారంటూ బీజేపీ నేత NVSS ప్రభాకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఆయన మరో బాంబు కూడా పేల్చారు. ఏ డేట్‌లో ఆమెకి కారు అందజేశారో, కారు తాళాలు ఎవరు ఇచ్చారో తన దగ్గర ప్రూఫ్స్‌ ఉన్నాయంటూ NVSS తన ఆరోపణల దాడిని మరింత తీవ్రం చేశారు. సీట్లు కాపాడుకోవడం కోసం కాంగ్రెస్‌ నేతలు ఇలా చేస్తారంటూ ఆయన మరిన్ని ఆరోపణలు చేశారు. తాజాగా జరిగిన టీవీ9 బిగ్‌ డిబేట్‌లో NVSS ప్రభాకర్‌ ఈ సంచలన కామెంట్లు చేశారు.

ఇదిలా ఉంటే.. NVSS ఆరోపణలకు కాంగ్రెస్‌ నుంచి ఘాటు రియాక్షన్లు వస్తున్నాయి. ఆయనపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. NVSS తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. కాగా పార్లమెంట్‌ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ రగడ మరింత రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరి కారు చిచ్చు ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..