Telangana: వికారాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య.. స్క్రూ డ్రైవర్‌తో కళ్లు పొడిచి..

|

Jun 11, 2023 | 4:40 PM

Vikarabad News: వికారాబాద్ జిల్లా పరిగిలో దారుణం జరిగింది. పరిగి మండలం కాల్లాపూర్‌లో యువతిని కత్తితో పొడిచి దుండగులు చంపేశారు. యువతి కళ్లను స్క్రూ డ్రైవర్‌తో దుండగులు పొడిచినట్లు నిర్ధారించారు.

Telangana: వికారాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య.. స్క్రూ డ్రైవర్‌తో కళ్లు పొడిచి..
representative image
Follow us on

Vikarabad News: వికారాబాద్ జిల్లా పరిగిలో దారుణం జరిగింది. పరిగి మండలం కాల్లాపూర్‌లో యువతిని కత్తితో పొడిచి దుండగులు చంపేశారు. యువతి కళ్లను స్క్రూ డ్రైవర్‌తో దుండగులు పొడిచినట్లు నిర్ధారించారు. శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన శిరీష (19).. అప్పటి నుండి కనిపించకుండా పోయింది. కుంట దగ్గర యువతి దుస్తులు, రక్తపు మరకలు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో కుంట నుంచి యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. అనతంరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిరీష ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్‌ శిక్షణ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే, శిరిషను దుండగలు హత్య చేసి నీటికుంటలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శిరిష ఆ సమయంలో బయటికి ఎందుకు వెళ్లింది..? ఎవరినైనా కలిసేందుకు వెళ్లిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..