Telangana: తెలంగాణలో ప్రారంభమైన మరో ఎన్నికల సందడి.. ఈ 11 నియోజకవర్గాల్లో కీలక ప్రభావం..

| Edited By: Srikar T

Dec 06, 2023 | 2:37 PM

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి ప్రారంభమైంది.ఈనెల 27వ తేదీన సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వాహణ కోసం రంగం సిద్ధమైంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ లో జరగాల్సిన ఈ ఎన్నికలు రాష్ట్రంలో నెలకొన్న అనేక పరిస్థితుల మధ్య కోర్టు ఆదేశాల మేరకు వాయిదా పడింది.

Telangana: తెలంగాణలో ప్రారంభమైన మరో ఎన్నికల సందడి.. ఈ 11 నియోజకవర్గాల్లో కీలక ప్రభావం..
Notification Release For Election Of Singareni Workers In Telangana
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి ప్రారంభమైంది.ఈనెల 27వ తేదీన సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వాహణ కోసం రంగం సిద్ధమైంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ లో జరగాల్సిన ఈ ఎన్నికలు రాష్ట్రంలో నెలకొన్న అనేక పరిస్థితుల మధ్య కోర్టు ఆదేశాల మేరకు వాయిదా పడింది. గతంలోనూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన సింగరేణి ఎన్నికలను ఈనెల 27న నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయి.. ఎన్నికల గుర్తులు కేటాయింపు కూడా గతంలోనే జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎల్సీ, సింగరేణి కార్మిక సంఘాలకు ఓటర్ల జాబితాను అందజేశారు.

కార్మిక శాఖ సమర్పించిన జాబితా ప్రకారం సంస్థలో మొత్తం 39,832 మంది ఓటర్లు ఉండగా ఓటర్ల జాబితా పై ఈనెల 6వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 8న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. మొత్తం మీద ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించిన 13 కార్మిక సంఘాలు, ఇక ప్రచారంపై దృష్టి సారించనున్నాయి. కార్మికులను ప్రసన్నం చేసుకోవడం కోసం వ్యూహరచనల్లో నిమగ్నమయ్యారు అభ్యర్థులు. ఐతే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ప్రాంత 11 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఆ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీ (INTUC) శ్రేణులకు నూతన ఉత్తేజాన్ని కల్పించింది.

సింగరేణి ఎన్నికల్లో సైతం పై చేయి సాధించేందుకు ఐఎన్టీయూసీ (INTUC) సీరియస్ గా ప్రయత్నాలను మొదలుపెట్టింది. సంస్థలో బలంగా ఉన్న ఏఐటియుసీ (AITUC) కూడా సింగరేణి ఎన్నికల్లో విజయం కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ (AITUC – INTUC) యూనియన్ల మధ్య కూడా సఖ్యత కుదురుతుందా..? లేదంటే ఎవరికి వారుగా పోటీ చేస్తారా..? అనే అంశాలపై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఇక గత ఎన్నికల్లో విజయం సాధించి గుర్తింపు సంఘంగా వ్యవహరించిన బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టిబిజికెఎస్ (TBGKS) వ్యవహారం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటిపోయిన నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు టిబిజికెఎస్ (TBGKS) కు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంకంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..