Lunar eclipse: చంద్ర గ్రహణం నేపథ్యంలో వేద పండితుల భిన్న వాదనలు

వరంగల్ లో ప్రసిద్ది గాంచిన భద్రకాళి అమ్మవారి దేవాలయం మాత్రం రెగ్యులర్ టైమింగ్స్స్ ప్రకారం తెరిచే ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు శేషు శర్మ తెలిపారు. అర్థరాత్రి గ్రహణం వల్ల ఎలాంటి నష్టం లేదని ఆలయాలు ఆ సమయంలో మూసే ఉంచుతారు కాబట్టి ప్రత్యేకంగా ద్వారా బంధనం చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

Edited By:

Updated on: Oct 28, 2023 | 1:30 PM

చంద్ర గ్రహణం నేపథ్యంలో వేద పండితుల భిన్న వాదనలు అయోమయానికి గురి చేస్తున్నాయి.. కొన్ని దేవాలయాలు ఈ రోజు సాయంత్రం నుండే మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.. మరికొందరు పండితులు మాత్రం ఆలయాలు మూసి వేయాల్సిన అవసరం లేదు.. ఆదివారం ఉదయం సంప్రోక్షణ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఈ రోజు అర్థరాత్రి 1.08 నిమిషాలకు పాక్షిక చంద్ర గ్రహణం వస్తుంది.. ఈ నేపధ్యంలో శనివారం సాయంత్రమే కొన్ని దేవాలయాలకు ద్వార బందనం చేస్తున్నారు.

ఐతే వరంగల్ లో ప్రసిద్ది గాంచిన భద్రకాళి అమ్మవారి దేవాలయం మాత్రం రెగ్యులర్ టైమింగ్స్స్ ప్రకారం తెరిచే ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు శేషు శర్మ తెలిపారు. అర్థరాత్రి గ్రహణం వల్ల ఎలాంటి నష్టం లేదని ఆలయాలు ఆ సమయంలో మూసే ఉంచుతారు కాబట్టి ప్రత్యేకంగా ద్వారా బంధనం చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం తీసే ఉంటుందని ఆయన వెల్లడించారు.  ఆదివారం యధావిధిగా ఉదయం 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ కార్యక్రమం కొనసాగుతుందని, పరిశుభ్రత, ప్రాతఃకాల పూజల అనంతరం 8 గంటలకు భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..