
నూతనంగా ప్రజలచే ఎన్నుకున్న సర్పంచ్ పాలకవర్గం గ్రామంలో మద్యపాన నిషేధాన్ని విధించారు. ఆయా గ్రామ పంచాయతీల ముందు పాలకవర్గం ప్రతిజ్ఞ చేస్తూ గ్రామంలో మద్యం అమ్మొద్దని తీర్మానం చేశారు. అందులో భాగంగానే
సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ భాను ప్రసాద్ ఆధ్వర్యంలో పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. తమ గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే లక్ష రూపాయల జరిమానా, పాలన చేసేవాళ్లు అమ్ముతున్నారని చెప్పినా.. వారికి పదివేల నజరానా ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
మొట్టమొదటి తీర్మానం కింద గ్రామంలో మద్యపానాన్ని నిషేధించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాను మాట్లాడుతూ.. గ్రామాలలో మద్యం ఏరులై పారుతోందని.. సామాన్యుడు పొద్దంతా పనిచేస్తే వచ్చే డబ్బులను మద్యానికి పెట్టి మద్యం సేవించి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారని.. మద్యం మహమ్మారిని తరిమికొట్టడానికే మద్యపాన నిషేధం చేస్తున్నామని అన్నారు. మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు స్వగ్రామం కావడం.. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని గ్రామస్తులు అంటున్నారు. గ్రామాలలో మద్యం విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని, ప్రతి గ్రామంలో మద్యపాన నిషేధాన్ని చేస్తే బాగుంటుందని అన్నారు గ్రామస్తులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి