నిజామాబాద్‌లో దొంగతనానికి పాల్పడిన చెడ్డీ గ్యాంగ్‌పై న్యాయస్థానం సంచలన తీర్పు.. ముఠా సభ్యులకు ఏడేళ్ల జైలు శిక్ష

|

Mar 10, 2021 | 10:01 PM

చెడ్డీ గ్యాంగ్‌ అంటేనే జనాల్లో వణుకు పుడుతుంది. ఎందుకంటే వారి చేసే దోపిడీ అంతా ఇంతాకాదు. ఆ గ్యాంగ్‌ దొంగతనం చేయడమే కాదు.. ఇంట్లో ఉన్న వ్యక్తులను చంపేందుకు వెనుకాడరు. ..

నిజామాబాద్‌లో దొంగతనానికి పాల్పడిన చెడ్డీ గ్యాంగ్‌పై న్యాయస్థానం సంచలన తీర్పు.. ముఠా సభ్యులకు ఏడేళ్ల జైలు శిక్ష
Follow us on

చెడ్డీ గ్యాంగ్‌ అంటేనే జనాల్లో వణుకు పుడుతుంది. ఎందుకంటే వారి చేసే దోపిడీ అంతా ఇంతాకాదు. ఆ గ్యాంగ్‌ దొంగతనం చేయడమే కాదు.. ఇంట్లో ఉన్న వ్యక్తులను చంపేందుకు వెనుకాడరు. ఇలాంటి చెడ్డీ గ్యాంగ్‌లు ఎన్నో దొంగతనాలకు పాల్పడుతూ.. చాలా మందిని హతమార్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. చెడ్డీ గ్యాంగ్‌ అంటేనే జనాలు భయపడిపోతుంటారు. వారు కత్తులు, మరణాయుధాలు కలిగి ఉంటారు. తాజాగా ఓ చెడ్డీ గ్యాంగ్‌కు కఠినమైన శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది న్యాయస్థానం. తెలంగాణలోని నిజామాబాద్‌లో దాదాపు సంవత్సరంన్నర కిందట దొంగతనాలకు పాల్పడిన ‘చెడ్డీ గ్యాంగ్‌’ మూఠాపై నిజామాబాద్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ చెడ్డీ గ్యాంగ్‌ మూఠాకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

ఈ మేరకు నిజామాబాద్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి కిరణ్మయి బుధవారం తీర్పు నిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2019 నవంబర్‌ 4న నిజామాబాద్‌ లలీతానగర్‌లోని పెద్ద తిమ్మయ్య ఇంట్లోకి ఏడుగురు దొంగలు మరణాయులతో ప్రవేశించి సుమారు 15 తులాల బంగారు అభరణాలను అపహరించారు. ఆ మరుసటి రోజు నిజామాబాద్‌ ఐదో పట్టణ పోలీసుస్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అదే సంవత్సరం డిసెంబర్‌ 29న ఓ కేసు విషయంలో రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు ఈ చెడ్డీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు . వారిని విచారించగా, నిజామాబాద్‌ జిల్లాలోనూ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల ముందు అంగీకరించారు.

దీంతో వారిని నిజామాబాద్‌ పోలీసులకు అప్పగించారు. వారి నుంచి నగదు, బంగారు అభరణాలు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పర్చారు. డైరెక్టర్‌ ఆఫ్‌ప్రాసిక్యూటర్‌ అల్లూరి రాంరెడ్డి పోలీసుల తరపున వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ఈ ముఠాలోని మహారాష్ట్రకు చెందిన ఆరుగురు సభ్యులు ఎండీ సోనూ, చౌహాన్‌ తారాసింగ్‌, బిట్టు, గుఫ్తాన్‌ ఆలీ, సాధిక్‌లకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. అలాగే ముఠాకు చెందిన మరో నిందితుడు ఎండీ సాజిద్‌పైనేరం నిరూపణ కాకపోవడంతో తనపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. కాగా, ఈ మధ్య కాలంలో చెడ్డీగ్యాంగ్‌ భారీ చోరీలకు పాల్పడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ముఠాలపై పోలీసులు కూడా ప్రత్యేక నిఘా పెట్టారు.

ఇవి చదవండి:

Telangana High Court: ఖమ్మం కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. క్షమాపణ చెప్పిన కలెక్టర్‌

Red Fort Violence Case: ఎర్రకోట హింస కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. దేశం విడిచి పారిపోతూ పట్టుబడిన నిందితుడు