
రోడ్డూ ప్రమాదాల నివారణకు పోలీసులు రకరకాల వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఉచితంగా హెల్మెట్ల పంపిణీ, రీల్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. రోడ్ల ప్రమాదాల నివారణకు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలో ఓ ఎస్ఐ మరింత వినూత్నంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ విజువల్స్ చూసి నడి రోడ్డుపై యమధర్మ రాజు నాటక ప్రదర్శన జరుగుతుందనుకుంటే పొరపాటే.. యమ ధర్మరాజు వేషాధారణాలో ఉన్న వ్యక్తి ఒక పోలీస్ అధికారి.. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల పోలిస్ స్టేషన్ లో ఎస్ఐ గా పని చేస్తున్న పడాల రాజేశ్వర్.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇలా యమ ధర్మరాజు వేషంవేశారు..
తన పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, చౌరస్తాల వద్ద ఇలా తన ప్రత్యేక వేషాధారణలో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. బైకర్లను ఆపి.. మీ వెనుక సీట్లోనే ఉన్నానని, మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే యమపురికి తీసుకుపోతనని.. కార్లో డ్రైవర్ పక్క సీట్లో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే .. మృత్యువు రూపంలో మిమ్మల్ని తనతో పాటే తీసుకువెళ్తానని అర్థం అయ్యేలా వివరిస్తున్నారు.
రోడ్డు ప్రమదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రతలను ఇలా యమధర్మరాజు రూపంలో వచ్చి వివరించటం అందర్ని అకర్షిస్తోంది. ఇలా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం.. సామాన్యులకు అర్థం అయ్యేలా వివరిస్తున్న ఎస్ఐ ని అందరూ అభినందిస్తున్నారు. గతంలో కూడా ఎస్సై రాజేశ్వర్ రోడ్డు ప్రమాదాల ప్రభావంపై సొంతంగా షార్ట్ ఫిల్మ్ చేసి అభినందనలు అందుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..