Telangana: నిజామాబాద్‌ కానిస్టేబుల్‌ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

తెలంగాణ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిజామాబాద్‌ సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్యకు పాల్పడిన నిందితుడు షేక్‌ రియాజ్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సారంగాపూర్‌ దగ్గర పట్టుబడిన రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్‌కు తరలించారు.

Telangana: నిజామాబాద్‌ కానిస్టేబుల్‌ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Nizamabad Crime

Updated on: Oct 19, 2025 | 2:44 PM

తెలంగాణ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిజామాబాద్‌ సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్యకు పాల్పడిన నిందితుడు షేక్‌ రియాజ్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సారంగాపూర్‌ దగ్గర పట్టుబడిన రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్‌కు తరలించారు. హత్య జరిగిన 48 గంటల్లోపే నిందితుడు రియాజ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇతను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిం చిన పోలీసులు.. నిందితుడి నేరాల చిట్టను చూసి కంగుతిన్నారు. నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న రియాజ్‌పై ఇప్పటివరకు 40కి పై కేసులు నమోదైనట్టు గుర్తించారు. చిన్న తనంతోనే తండ్రిని కోల్పోయిన రియాజ్.. తెలివి వచ్చినప్పటి నుంచి నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు.

అయితే నగరంలో వరుస వాహన, గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో అతన్ని వెంబడించిన సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌పై రియాజ్ ఎదురుదాడికి దిగాడు. అతనిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానిక సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు 48 గంటల్లో అతన్ని అరెస్ట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.