ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత మొఖం చాటేసి మరో మూడు పెళ్లిల్లు చేసుకున్నాడని ఓ భార్య కన్నీటి పర్యంతం అయింది. తనతో విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించినప్పటికీ విచారణ జరుగుతుండగానే మరో వివాహం చేసుకున్నాడు ఘనుడు. దీంతో మరోసారి న్యాయం కావాలంటూ రోడ్డెక్కి ఆ అభాగ్యురాలు.
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన మంజులను, జగిత్యాల రూరల్ మండలం సోమనపల్లికి చెందిన చిర్ర గోపి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కూడా కలిగిన తరువాత ఐదేళ్ల క్రితం తనతో విడాకులు ఇప్పించాలని చిర్ర గోపి కోర్టును ఆశ్రయించాడు. అయితే విడాకులపై కోర్టు తీర్పు వెలువడకముందే వేరే వారిని ప్రేమ పేరుతో వివాహం చేసుకుంటూ మోసం చేశాడు. ముచ్చటగా మూడో వివాహానికి సిద్ధమయ్యాడు.
తనకు జరిగిన అన్యాయం మిగతా యువతులకు జరగకూడదన్న కారణంతో తాను పోలీసులను ఆశ్రయించినట్టు మంజుల వెల్లడించింది. అర్థాంతరంగా తన జీవితాన్ని వదిలేసి ముంబాయిలో మరో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, కర్ణాటకకు చెందిన మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని ఆరోపించింది. ఫిబ్రవరి 16వ తేదీన గోపి కుటుంబ సభ్యుల సమక్షంలోనే వివాహం జరిగింది. ముంబాయి థానే ప్రాంతంలో ఓ కళ్లు దుకాణంలో పని చేస్తున్న గోపి గురించి పిబ్రవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిత్య పెళ్లి కొడుకుగా మారిన తన భర్త చిర్ర గోపిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్‌ను కలిసి అభ్యర్థించింది. అతని వల్ల ఎంతో మంది యువతలు జీవితాలను నాశనం అయ్యే ప్రమాదం ఉన్నందున అతనిపై కఠినంగా వ్యవహరించాలని కోరింది. తనను, తన పిల్లలను వదిలేసి వేరే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్న తీరుపై దృష్టి సారించి న్యాయం చేయాలని మంజుల పోలీసులను వేడుకుంటోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..