NHRC: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్చార్సీ ఆగ్రహం

|

Aug 14, 2021 | 4:04 PM

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయంగా చర్యలు తీసుకోకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)....

NHRC: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్చార్సీ ఆగ్రహం
Nhrc
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయంగా చర్యలు తీసుకోకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని.. అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సుప్రీంకోర్టు న్యాయవాది చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక సమర్పించాలని గత ఏడాది డిసెంబరులో రెండు రాష్ట్రాల సీఎస్‌లను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. ఇప్పటివరకు ఆత్మహత్యల కట్టడికి తీసుకున్న శాస్త్రీయ చర్యలు తెలపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని మరోసారి ఆదేశించింది. గడువులోగా నివేదిక ఇవ్వకపోతే ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఎదుట హాజరుకావాల్సి వస్తుందని హెచ్చరించింది. 2019 రికార్డుల ప్రకారం 426 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపింది. తెలంగాణలో ఒకే వారంలో 22 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొంది. ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలు సరిపోవన్న జాతీయ మానవ హక్కుల కమిషన్‌..ఆంధ్రప్రదేశ్‌లో 383 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపింది.

Also Read:  ‘దళిత బంధు’ అందరికీ అందించకపోతే దీక్ష చేస్తా.. ఈటల రాజేందర్ హెచ్చరిక

4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. చిన్న క్లూ కూడా లేదు.. రంగంలోకి 700 మంది పోలీసులు.. ఫైనల్‌గా

మానవ హక్కుల కోణంలోనూ దృష్టి సారించాలి : ఎన్‌హెచ్చార్సీ

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్చార్సీ).. ఆహార భద్రత సమస్యలపై తన సభ్యులతో సమావేశాన్ని నిర్వహించింది. ఆహార హక్కు.. చట్టబద్ధమైన హక్కుతో పాటు ” మానవ హక్కుల కోణం”లోనూ చూడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. కాగా, ఈ సమావేశంలో దేశంలోని చిన్నారులు, గర్భిణిలు, తల్లుల పోషకాహార స్థితి, కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌’ అమలు గురించి కూడా చర్చించినట్టు సంబంధిత అధికారులు వివరించారు. ఈ సందర్భంగా 2016-18కి చెందిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘ కాంప్రెహెన్సివ్‌ నేషనల్‌ న్యూట్రీషన్‌ సర్వే (సీఎన్‌ఎన్‌ఎస్‌)’ నివేదికను ఎన్‌హెచ్చార్సీ ఉటంకించింది. ఈ విషయంలో పలు కీలక సూచనలు చేసింది. కాగా, ఈ సమావేశానికి ఎన్‌హెచ్చార్సీ సభ్యుడు రాజీవ్‌ జైన్‌ అధ్యక్షత వహించారు.