AP News and Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..

|

Oct 17, 2021 | 7:53 AM

తూర్పుగోదావరి జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. వీటి దాడిలో 27 మందికి గాయాలయ్యాయి. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. పిచ్చికుక్కలను కట్టడి చేయాలని

AP News and Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..
Telugu States News
Follow us on

1. తూర్పుగోదావరి జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. వీటి దాడిలో 27 మందికి గాయాలయ్యాయి. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. పిచ్చికుక్కలను కట్టడి చేయాలని కోరుతున్నారు ప్రజలు.

2. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు నారా లోకేశ్. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్‌ ఆగిపోయిందని సెటైర్‌ వేశారు టీడీపీ కీలక నేత. రాష్ట్రంలో విధిస్తున్న విద్యుత్‌ కోతలపై ట్విటర్‌ వేదికగా స్పందించారు లోకేశ్. అంధకారంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు.

3. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఐఎండీ. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు.

4. హనుమకొండ జిల్లా శాయంపేట రైల్వేగెట్ వద్ద ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో గెట్ మెన్ రాజుపై దాడి చేశాడు యువకుడు. ట్రైన్ వస్తుందని గేట్ వేయడంతో, తాగిన మైకంలో బలవంతంగా గేట్ తెరిచే ప్రయత్నం చేశాడు.

5. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసింది వర్షం. మహబూబ్‌నగర్ పట్టణంతో పాటు జడ్చర్లలో భారీ‌వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. జడ్చర్లలోని శాంతినగర్‌కు చెందిన యుగేందర్ నాలాలో కొట్టుకుపోయి మృతి‌చెందాడు.

6. కామారెడ్డి జిల్లా కనకల్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రావణాసురుడిని దహనం చేస్తే రాముణ్ణి దహనం చేస్తామని హెచ్చరించారు దళిత యువకులు. దీంతో ఇరువర్గాల తోపులాట జరిగింది. ఈ ఘటనలో తాడ్వాయి ఎంపీపీకి గాయాలయ్యాయి.

7. తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు అధికారులు. ఆదిలాబాద్, కోమరంభీం, అసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు అరేంజ్ అలెర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ తోపాటు మిగతా 26 జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేశారు అధికారులు.

8. అంబర్‌పేట్ పోలిస్‌స్టేషన్ సమీపంలో భారీ చెట్టు నేలకొరిగింది. అంబర్‌పేట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఓ కంటైనర్ తాకి వెళ్లింది. ఎడతెరపి లేని వానతో నానుతున్న చెట్టు.. ఒక్కసారిగా రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. ఫలితంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

9. జనసేన నేత పోతిన మహేష్‌కి కౌంటర్ ఇచ్చారు దుర్గగుడి చైర్మన్. వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని వార్నింగ్‌ ఇచ్చారు సోమినాయుడు. ప్రభుత్యానికి పేరు రావడంతో జనసేన నాయకులు ఓర్వలేక పోతున్నారని ఫైర్‌ అయ్యారు ఛైర్మన్.

Read also: Motkupalli: టీఆర్ఎస్ పార్టీలోకి మోత్కుపల్లి నర్సింహులు.. చేరికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..