తెలంగాణలో నత్తనడకగా సాగుతున్న సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలు.. పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌

|

Jan 22, 2021 | 12:42 PM

మూడేండ్లు గడుస్తున్నా నేటికీ కలెక్టర్ కార్యాలయం పూర్తి కాలేదు. ఇప్పటికీ ముగ్గురు కలెక్టర్లు మారినా పనులు..

తెలంగాణలో నత్తనడకగా సాగుతున్న సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలు.. పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌
Follow us on

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ఎమ్మెల్యే శంకర్ నాయక్ సందర్శించారు. జాతీయ రహదారి ప్రక్కన 32 ఎకరాల విస్తీర్ణంలో రూ. 42. 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పనులకు 2018 ఏప్రిల్ 4 న పురపాలక శాఖ మంత్రి తారక రామారావు భూమి పూజ చేశారు.

అయితే శంకుస్థాపన చేసి మూడేండ్లు గడుస్తున్నా నేటికీ కలెక్టర్ కార్యాలయం పూర్తి కాలేదు. ఇప్పటికీ ముగ్గురు కలెక్టర్లు మారినా పనులు ముందుకు సాగడంలేదు. అధికారుల నిర్లక్ష్యమా, కాంట్రాక్టుల అలసత్వమా, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడమా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎప్పటికప్పుడు నూతనంగా నిర్మించే కలెక్టరేట్ భవనాన్ని సందర్శించి త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులకు సూచించినా పనులు మాత్రం వేగం పుంజుకోవడం లేదు. మరో ఆరు నెలల్లోనే నిర్మాణపు పనులను పూర్తి చేయించి ప్రారంభోత్సవం చేయటానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తెలిపారు.